'గేమ్ ఛేంజర్' మ్యూజిక్ రేంజ్ వేరు, అన్నీ ట్రిపుల్ ఎక్సెల్.. 'గుంటూరు కారం' రూమర్స్ కి చెక్ పెట్టిన తమన్
ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా స్టార్ హీరోల చిత్రాలు చేసే అవకాశాలు తమన్ కి వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంటే ఆడియన్స్ ముందుగా తమన్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా స్టార్ హీరోల చిత్రాలు చేసే అవకాశాలు తమన్ కి వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంటే ఆడియన్స్ ముందుగా తమన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎంత ట్రోలింగ్ ఎదురైనా ప్రతి సారీ తమన్ తన మ్యూజిక్ తో సమాధానం ఇస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న బ్రో చిత్రం మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది.
దీనితో తమన్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో తమన్ తాను తదుపరి చేయబోతున్న చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తమన్ బ్రో మూవీతో పాటు, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, స్కంధ , భగవంత్ కేసరి, ఓజి లాంటి క్రేజీ చిత్రాలకి తమన్ సంగీతం అందిస్తున్నారు. తాను ప్రతి చిత్రానికి ఒకే విధంగా కష్టపడడతానని కొన్నిసార్లు ఆ చిత్రాలు వర్కౌట్ కావచ్చు కాకపోవచ్చు అని తెలిపారు.
రాంచరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ చిత్రం మ్యూజిక్ ఎలా ఉండబోతోంది అని యాంకర్ ప్రశ్నించగా.. గేమ్ ఛేంజర్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది. ఇంకా చెప్పాలంటే అవి ట్రిపుల్ ఎక్సెల్ రేంజ్ లో పేలే సాంగ్స్ అంటూ తమన్ ఆసక్తిని పెంచేశాడు.
అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రంపై అనేక పుకార్లు ప్రచారం జరుగుతున్నాయి. ఈ చిత్రం నుంచి తమన్ తప్పుకున్నాడు అని కూడా రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ కి తమన్ చెక్ పెట్టాడు. గుంటూరు కారం మ్యూజిక్ వర్క్ కంటిన్యూ అవుతోందని తెలిపాడు. పుకార్లు పుట్టించే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మేము ప్రశాంతంగా పని చేసుకుంటున్నాం. మాట్లాడేవాళ్ళని మాట్లాడుకోని అని కొట్టిపారేశారు.