నానికి తమన్ కౌంటర్ ? వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ ఎలా మొదలయింది..
సౌత్ లో తమన్ ప్రస్తుతం తిరుగులేని సంగీత దర్శకుడు. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో తమన్ దూసుకుపోతున్నాడు. శంకర్ లాంటి దిగ్గజ దర్శకులతో తమన్ పనిచేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా తమన్ సంగీతం అందిస్తున్న చిత్రాలు ఘనవిజయాలు సాధిస్తున్నాయి.
సౌత్ లో తమన్ ప్రస్తుతం తిరుగులేని సంగీత దర్శకుడు. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో తమన్ దూసుకుపోతున్నాడు. శంకర్ లాంటి దిగ్గజ దర్శకులతో తమన్ పనిచేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా తమన్ సంగీతం అందిస్తున్న చిత్రాలు ఘనవిజయాలు సాధిస్తున్నాయి. దీనితో తమన్ కి డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం తమన్ 'భీమ్లా నాయక్', సర్కారు వారి పాట, RC 15, గని లాంటి క్రేజీ చిత్రాలకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస విజయాలతో నాని నటుడిగా తిరుగులేని ఖ్యాతి సొంతం చేసుకున్నాడు. ఊహించని విధంగా నాని, తమన్ మధ్య కోల్డ్ వార్ సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్ తాజాగా చేసిన ట్వీట్స్ నానిని ఉద్దేశించినవే అని.. నానికి కౌంటర్ గా తమన్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు అంటున్నారు.
నాని ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన సినిమాలోని సంగీతం అన్ని ఇతర విభాగాల్లాగే ప్రాముఖ్యత పరంగా సమానంగా ఉంటుంది. అంతే కానీ సంగీతం, బిజియమ్ ఇతర విభాగాలను డామినేట్ చేసే విధంగా ఉండకూడదు. అన్నీ సమానంగా ఉండాలి. లేకుంటే సినిమాలో శృతి లోపిస్తుంది అని నాని తెలిపాడు.
నాని చేసిన కామెంట్స్ తమన్ ని ఉద్దేశించినవే అని అంటున్నారు. ఎందుకంటే ఇటీవల తమన్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎక్కువగా ప్రశంసలు కురుస్తున్నాయి. అఖండ చిత్రంలో తమన్ బిజియం ఎక్కువగా హైలైట్ అయిందని ప్రశంసలు దక్కాయి. సో నాని చేసిన వ్యాఖ్యలు తమన్ ని ఉద్దేశించే అని అంటున్నారు.
నాని వ్యాఖ్యలకు తమన్ పరోక్షంగా ట్విట్టర్ లో సమాధానం ఇవ్వడంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతోందని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. 'సినిమాలో ఏ క్రాఫ్టు మరో క్రాఫ్ట్ ని డామినేట్ చేసే విధంగా ఉండదు. అన్ని విభాగాలు సరిగ్గా ఉన్నప్పుడే ఆ చిత్రానికి కంప్లీట్ ఫిల్మ్ అని అంటారు. సినిమాలో అన్ని విభాగాలు గొప్పగా ఉండాలి' అని తమన్ ట్వీట్ చేశాడు.
అసలు ఇంతకీ నాని, తమన్ మధ్య ఈ కోల్డ్ వార్ ఎలా మొదలైంది అనే చర్చ జరుగుతోంది. నాని 'టక్ జగదీష్' చిత్రానికి తమన్ పాటలు అందించారు. కానీ ఏమైందో ఏమో కానీ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం గోపి సుందర్ ని తీసుకున్నారు. అప్పుడే నాని, తమన్ మధ్య విభేదాలు మొదలైనట్లు చర్చ జరుగుతోంది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాన్ తో బోయపాటి ...? బన్నీతో సినిమా ఏమైనట్టు..?