గత ఏడాది నుంచి సంగీత దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నా థమన్ పని చేసిన సినిమాలు మాత్రం కమర్షియల్ గా సక్సెస్అవ్వడం లేదు. గత ఏడాది భాగమతి - తొలిప్రేమ సినిమాల అనంతరం థమన్ సంగీతం అందించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వలేదు.

అమర్ అక్బర్ ఆంటోని - కవచం - మిస్టర్ మజ్ను ఇలా చాలా సినిమాలు ఆడియెన్స్ ని నీరాశపరిచినవే. అరవింద సమేత కూడా పూర్తి స్థాయిలో ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సారి బన్నీ సినిమా ద్వారా బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకోవాలని థమన్ తనవంతు కృషి చేస్తున్నాడు. త్రివిక్రమ్ టేస్ట్ కి తగ్గట్టుగా రొమాంటిక్ - యాక్షన్ - ఎమోషన్ ఇలా త్రి డైమెన్షన్ లో సంగీతాన్ని అందించనున్నాడట. 

ఇటీవల ఒక షెడ్యూల్ అనంతరం దర్శకుడు హీరో థమన్ తో సిట్టింగ్ వేసి కంపోజింగ్ పై చర్చలు జరిపారు. థమన్ ఇద్దరి క్రేజ్ కి తగ్గట్టుగా జనాల్ని మెప్పించే విధంగా సరికొత్త బాణీలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతోన్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.