ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత మొత్తానికి అభిమానులకు మంచి ఆనందాన్ని ఇచ్చింది. సినిమా కలెక్షన్స్ చూస్తుంటే సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని తెలుస్తోంది.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత మొత్తానికి అభిమానులకు మంచి ఆనందాన్ని ఇచ్చింది. సినిమా కలెక్షన్స్ చూస్తుంటే సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని తెలుస్తోంది. ఇప్పటికే పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులు నమోదయ్యాయి. యూఎస్ లో కూడా సినిమా 1 మిలియన్ మార్క్ ను దాటేసింది.
ఇక సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా మంచి క్రేజ్ తెచ్చింది. మెయిన్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచిందని చెప్పాలి. అయితే థమన్ కెరీర్ ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది. పలువురు స్టార్ దర్శకులు అతనితో వర్క్ చేయాలనీ అనుకుంటున్నారు. ఇక త్వరలో రిలీజ్ కానున్న సాహో స్పెషల్ టీజర్ కు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా స్పెషల్ టీజర్ ను రిలీజ్ చెయ్యాలని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. అందుకే టీజర్ కోసం మ్యూజిక్ కంపోజ్ చేయమని థమన్ ని కోరినట్లు సమాచారం. అసలైతే సినిమాకు శంకర్ ఏ హాసన్ లాయ్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న సాహో సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
