Thaman: మొన్న బాలయ్యకు నేడు పవన్ కి... థమన్ గిఫ్ట్స్ అదుర్స్
2021 అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా అఖండ నిలిచిన నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాత్ర చాలా కీలకం అని చెప్పాలి. దీంతో మొన్న బాలయ్యకు నేడు పవన్ కి థమన్ తన సంగీతంతో భారీ హిట్స్ కట్టబెట్టారని అంటున్నారు.
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) టాలీవుడ్ సెన్సేషన్ గా మారిపోయారు. ఆయన మ్యూజిక్ ఇస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అన్నట్లు పరిస్థితి మారింది. అఖండ సినిమా విజయానికి థమన్ మ్యూజిక్ ఎంత ప్లస్ అయిందో తెలిసిందే. లేటెస్ట్ రిలీజ్ భీమ్లా నాయక్ (Bheemla Nayak) విషయంలో కూడా ఇదే మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ భీమ్లా నాయక్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అర్థ రాత్రి నుండే థియేటర్స్ దగ్గర పవన్ ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. భీమ్లా నాయక్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. పవన్ నుండి వారు ఆశిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ కావడంతో పిచ్చ ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్ కే చంద్ర టేకింగ్, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే సినిమాను అద్భుతంగా నడిపాయి.
ఇక సినిమా మొత్తం పవన్-రానా షోగా సాగింది. నువ్వా నేనా అన్నట్లు ఇద్దరి పెర్ఫార్మన్స్ ఉంది. అయితే భీమ్లా నాయక్ లోని పవర్ ఫుల్ సన్నివేశాలు స్క్రీన్ పై పండడానికి ప్రధాన కారణం థమన్ బీజీఎం. చాలా సన్నివేశాలను థమన్ తన అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేశారు. భీమ్లా నాయక్ చిత్రంలో ఫ్యాన్స్ కి నచ్చిన అంశాలలో థమన్ బీజీఎం ఒకటి. భీమ్లా నాయక్ కి ఎంతటి టాక్ రావడానికి థమన్ అన్నమాట సర్వత్రా వినిపిస్తుంది.
టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ అఖండ (Akhanda)చిత్రానికి కూడా థమన్ సంగీతం అందించారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన హైవోల్టేజ్ సన్నివేశాలకు థమన్ ఇచ్చిన బీజీఎం గూస్ బంప్స్ కలిగించింది. 2021 అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా అఖండ నిలిచిన నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాత్ర చాలా కీలకం అని చెప్పాలి. దీంతో మొన్న బాలయ్యకు నేడు పవన్ కి థమన్ తన సంగీతంతో భారీ హిట్స్ కట్టబెట్టారని అంటున్నారు.
ఇక టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రాలు సర్కారు వారి పాట(Sarkaru vaari paata), చిరంజీవి గాడ్ ఫాదర్, మహేష్-త్రివిక్రమ్ మూవీతో పాటు రామ్ చరణ్ 15వ చిత్రానికి థమన్ పనిచేస్తున్నారు. ఈ ఏడాది విడుదల కానున్న ఈ చిత్రాలకు కూడా థమన్ నుండి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఆశించవచ్చు. అరంగేట్రంతో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన థమన్ అల వైకుంఠపురంలో ముందు వరకు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అల వైకుంఠపురంలో తర్వాత థమన్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించాడు.