Asianet News TeluguAsianet News Telugu

ఒప్పుకున్నాడా...దిల్ రాజు కష్టపడి ఒప్పించారా?మిలియన్ డాలర్ క్వచ్చిన్

 వారసుడు సినిమాకు బజ్‌ రావాలంటే విజయ్‌ ప్రమోషన్స్ అవసరం. ఈ విషయమై దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. తనతో విజయ్ ఇక్కడకు వచ్చి ప్రమోట్ చేస్తారని మాట ఇచ్చారని చెప్పారు. 

Thalapathy #Vijay will come to Hyderabad to promote the film
Author
First Published Jan 9, 2023, 4:10 PM IST

గత  కొద్ది రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్త. తమిళ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏకంగా స్టేజ్‌ పైనే స్టెప్పులేసిన విజయ్‌.. ఇక్కడ ప్రమోషన్‌లకు మాత్రం రాను అంటున్నాడు. తెలుగు నిర్మాత అయినా అసలు హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపటం లేదు. ఎందుకంత తెలుగు అంటే చిన్న చూపు. ఇక్కడ నిర్మాత కావాలి. ఇక్కడ డైరక్టర్ తో సినిమా చేయాలి. ఇక్కడ ఆడియన్స్ కావాలి. కానీ ఇక్కడకు రాడు అనేదే. 

వాస్తవానికి . ఇప్పుడున్న టఫ్ కాంపిటేషన్ లో హీరోలు దేశమంతటా తిరిగి ప్రమోషన్స్ చేస్తున్నారు. విదేశాలు కూడా చుట్టి వస్తున్నారు. అక్కడ ప్రేక్షకులను కలుస్తున్నారు. ఓటిటిలు వచ్చిన నేటి  పరిస్థితుల్లో సినిమాకు ప్రమోషన్‌లు చాలా అవసరం. ఎంత పెద్ద హీరో అయినా సరే తన సినిమా కోసం ప్రమోషన్‌లు చేయకపోతే మొదటికే మోసం వస్తుందని గుర్తిస్తున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్ వంటి స్టార్ ‘విక్రమ్‌’ కోసం ఇక్కడ రెండు, మూడు సార్లు ప్రెస్‌మీట్‌లను పెట్టాడు. ఇక ‘పొన్నియస్‌ సెల్వన్’ సినిమాకైతే ఏకంగా టీమ్ మొత్తం ఇక్కడికి తరలి వచ్చిందనే సంగతి తెలిసిందే. కార్తి, సూర్య లు తమ సినిమాలు రిలీజవుతున్నాయంటే చాలు.. తమిళ ప్రమోషన్‌లకు ఏమాత్రం తీసిపోకుండా తెలుగులో కూడా భారీ ప్రమోషన్లు చేస్తుంటారు.  ఈ క్రమంలో   విజయ్ మాత్రం తెలుగు ప్రమోషన్‌లకు నో చెప్తూ ఉండటం అందరినీ ఆశ్చర్య పరిచే విషయం.

తెలుగులో ఇప్పుడున్న సిట్యువేషన్ లో  వారసుడు సినిమాకు బజ్‌ రావాలంటే విజయ్‌ ప్రమోషన్స్ అవసరం. ఈ విషయమై దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. తనతో విజయ్ ఇక్కడకు వచ్చి ప్రమోట్ చేస్తారని మాట ఇచ్చారని చెప్పారు. రిలీజ్ డేట్ మారింది కాబట్టి టైమ్ ఉందని మెల్లిగా ప్రమోషన్స్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఏదైమైనా సినిమా బాగుంటే మిగతా విషయాలు పెద్దగా పరిగణనలోకి రావు.  ఇక రిలీజ్ డేట్ వాయిదా విషయమై విజయ్ గుర్రుగా ఉన్నాడని ప్రచారం మొదలైపోయింది. ఒకే రోజు తమిళ,తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తారు అనుకుంటే వాయిదా వేయటం విజయ్ కు నచ్చలేదని  ఓ వర్గం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దాని వల్ల ఒరిగేదేంటో వారికే తెలియాలి.
 
 తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరో గా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ తమిళనాడు విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు లో మాత్రం పెద్దగా క్రేజ్ లేకుండానే భారీ ఎత్తున విడుదల కాబోతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios