Asianet News TeluguAsianet News Telugu

నష్టం రాకుండా ‘మాస్టర్‌’ ప్లాన్ అదిరిందిగా

యాక్షన్‌ తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్ర టీమ్ భావించింది. కాకపోతే, కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇంతకాలం వంద శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ కు అవకాసం ఉంటుందేమో అనే ప్రయత్నాలు చేసారు. అయితే అటువంటి పరిస్దితి ఏమీ కనపడటం లేదు. దాంతో ఈ సినిమాను యాభై శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం.

Thalapathy Vijay Master movie release plan jsp
Author
Hyderabad, First Published Dec 26, 2020, 4:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయ్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘మాస్టర్‌’. ఖైదీ సినిమాతో స్టార్ డైరక్టర్ గా ఎదిగిన లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్  కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మాస్టర్‌’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో చిత్రవర్గాల నుంచి సమాచారం వచ్చినప్పటికీ ఓటీటీలో విడుదల చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఈ చిత్రం టీమ్ తెలుగు టీజర్ ని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ నేపధ్యంలో ఇక ఈ చిత్రం రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌ తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్ర టీమ్ భావించింది. కాకపోతే, కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇంతకాలం వంద శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ కు అవకాసం ఉంటుందేమో అనే ప్రయత్నాలు చేసారు. అయితే అటువంటి పరిస్దితి ఏమీ కనపడటం లేదు. దాంతో ఈ సినిమాను యాభై శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం.

తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు హీరో విజయ్ తో దర్శకుడు,నిర్మాత మాట్లాడి సెటిల్ చేసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాసం ఉందంటున్నారు.అదే సమయంలో ఇది భారీ బడ్జెట్ సినిమా కావటంతో రికవరీ సమస్య లేకుండా ఉండటం కోసం వేరే సినిమాలు ఏమీ పోటీకు లేకుండా చూస్తున్నారట. అలాగే ఒకేసారి తెలుగు,కన్నడ, హిందీ,తమిళ,మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నారట. దాంతో డబ్బింగ్ పనులు మొదలెట్టేసారట. అన్ని వైపుల నుంచి లాక్ చేస్తే గిట్టు బాటు అవుతుందని నిర్మాతలు భావించారట. 
    
ఇప్పటికే దీపావళి కానుకగా తమిళ టీజర్‌ను విడుదల చేస్తే యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 45 మిలియన్‌ల వ్యూస్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. మరే సినిమాకు సాధ్యం కాని 2 మిలియన్ల లైకులు ఈ సినిమాకు రావడం విశేషం.  విజయ్‌ హీరోగా, విజయ్‌ సేతుపతి విలన్ గా నటిస్తున్న చిత్రం ఇది. 

‘అది నాకూ తెలుసు సర్‌. జేడీ ఒక నేరస్థుడు. ఒక పంతులుకు ఇంత ధైర్యం యాడ్నుంచి వచ్చింది’.. అంటూ టీజర్‌ ప్రారంభమై ఆసక్తి రేపుతుంది. 1.30 నిమిషాల పాటు సాగే ఈ టీజర్‌ అభిమానులకు పండగ చేసుకునేలా ఉంది.  ఈ సినిమాలో విజయ్‌ సరసన మాళవికా మోహన్‌ నటించనుంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత దర్శకులు. అర్జున్‌ దాస్, సిమ్రన్‌, ఆండ్రియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎక్స్‌బీ ఫిల్మ్స్‌, సెవన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios