Asianet News TeluguAsianet News Telugu

#LEO ఓటటి వెర్షన్ పూర్తిగా వేరే? ఆ మార్పు ఏంటంటే....

లియో థియేటర్ వెర్షన్ కు ,ఓటిటి వెర్షన్ కు చాలా తేడా ఉంటుందని చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఈ విషయం ప్రస్తావించాడు. అతను చెప్పిన దాని ప్రకారం  ...

Thalapathy Vijay #LEO OTT version is different from theatres? jsp
Author
First Published Oct 31, 2023, 8:39 AM IST | Last Updated Oct 31, 2023, 8:39 AM IST


థియేటర్ లో చూసిన జనం మళ్లీ ఓటిటిలో రిలీజైనప్పుడు రిపీట్ గా చూడాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. లేకపోతే ఓటిటిలో వ్యూస్ రావు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కావాలంటే రకరకాల జిమ్మిక్కులు, స్కెచ్ లు వేయాలి. లోకేష్ కనకరాజు ఈ విషయంలో అందరికన్నా ముందున్నాడు. లియో ఓటిటి లో కూడా మంచి ఓపినింగ్స్ వ్యూస్ రావాలని కోరుకుని అందుకు తగ్గట్లే ప్లాన్ చేస్తున్నాడు. 

ఇళయదళపతి విజయ్ తాజాగా  భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'లియో'తో అభిమానుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పక్కా యాక్షన్​ మోడ్​లో వచ్చిన ఈ సినిమా  దసరా సందర్బంగా వారం క్రితం అంటే అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైంది. లియో సినిమా రిలీజ్ అయ్యాక తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా మిగిలిన ప్లేస్ లలో మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. విజయ్ ,లోకేష్ కనకరాజ్ అభిమానులని లియో సినిమా ఆనందపరిచినా..  రెగ్యులర్ సినీ గోయర్స్ ని  మాత్రం నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా సినిమా ఫ్లాష్ బ్యాక్ విషయంలో చాలా మందికి అసంతృప్తి ఉంది. ఆ విషయం లియో కనక రాజ్ ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో త్వరలో ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతున్న నేపధ్యంలో కొత్త విషయం రివీల్ చేసారు.

Thalapathy Vijay #LEO OTT version is different from theatres? jsp

లియో థియేటర్ వెర్షన్ కు ,ఓటిటి వెర్షన్ కు చాలా తేడా ఉంటుందని చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఈ విషయం ప్రస్తావించాడు. అతను చెప్పిన దాని ప్రకారం   లియో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వటానికి , ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవటానికి ఉద్దేశించింది. అయితే ఓటిటి వెర్షన్ లో వేరుగా ఉంటుందని అన్నారు. లియో కథ ప్రకారం...సినిమాలో హీరో పాత్ర లక్ష్యం లియో చచ్చిపోయాడని, తాను పార్ధీపన్ అని ప్రపంచం నమ్మించాలని నిరంతరం ప్రయత్నించటమే. ఓటిటి వెర్షన్ లో లియో కేవలం క్లైమాక్స్ లో మాత్రమే అంటోని దాస్ కు తాను లియోని అని రివీల్ చేస్తాడని అన్నారు. అప్పటిదాకా ఆ సస్పెన్స్ అలాగే కొనగాగుతుందని అన్నారు. ఇక  కొన్ని థియేటర్ వెర్షన్ లో లేని సీన్స్ ఓటిటిలో కనపడబోతున్నాయట. 
  
  ఈ సినిమాకి లోకేష్, రత్న కుమార్, దీరజ్ వైద్యుడు స్క్రీన్ ప్లే అందించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో న‌టించారు. మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, పలువురు సహాయక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించ‌గా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై ల‌లిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 విజ‌య్ ఇందులో పార్తిబ‌న్‌, లియోగా రెండు కోణాలున్న పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ రెండింటికీ మ‌ధ్య ఉన్న తేడాని చ‌క్క‌గా చూపించారు. ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా పార్తి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించిన తీరు.. ఆయ‌న లుక్‌, గెట‌ప్ ఆక‌ట్టుకుంటాయి. ఇక లియోగా నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్ర‌లో చ‌క్క‌టి హీరోయిజాన్ని చూపించారు. ప్రస్తుతానికి దసరా సెలవులను పర్ఫెక్ట్‌ గా క్యాష్ చేసుకుంది లియో.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios