Asianet News TeluguAsianet News Telugu

#LEO OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

త్వరలోనే నెట్ ప్లిక్స్ నుంచి అఫీషియల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.  ప్రస్తుతానికి దసరా సెలవులను పర్ఫెక్ట్‌ గా క్యాష్ చేసుకుంటున్న లియో… ఓటిటిలోనూ  ఈ  జోరు ని ఏ మేరకు కొనసాగిస్తుందో చూడాలి.  
 

Thalapathy Vijay #LEO OTT streaming date is locked jsp
Author
First Published Oct 26, 2023, 12:21 PM IST

 


ఇళయదళపతి విజయ్ తాజాగా  భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'లియో'తో అభిమానుల ముందుకు వచ్చారు. పక్కా యాక్షన్​ మోడ్​లో వచ్చిన ఈ సినిమా  దసరా సందర్బంగా వారం క్రితం అంటే అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైంది. మిక్సెడ్ రివ్యూలు అందుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ లో మాత్రం దుమ్ము రేపుతోంది.  ఈ క్రమంలో చాలా మంది ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాల గురించి క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్​ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.  

ఇక  ఈ సినిమా థియేట‌ర్‌లో విడుద‌లైన నెల‌రోజుల త‌రువాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ఎగ్రిమెంట్ చేసుకున్నార‌ట‌. ఈ లెక్క‌న ఈ చిత్రం నవంబ‌ర్ 21 స్ట్రీమింగ్  కానుంది. ఈ ఓటిటి  ఎగ్రిమెంట్ మూలంగానే హిందీ నేషనల్ మల్టి ప్లెక్స్ రిలీజ్ లేదు. అక్కడ  రూల్ ప్రకా థియేటర్ రిలీజ్ కు ఓటిటి రిలీజ్ కు మధ్య ఆరు వారాల గ్యాప్ ఉండాలి. కానీ భారీ ఎమౌంట్ కు నెట్ ప్లిక్స్ కు నాలుగువారాల్లోనే ఓటిటి రిలీజ్ కోసం ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే నెట్ ప్లిక్స్ నుంచి అఫీషియల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. 
   
ఇక  ఈ సినిమాకి లోకేష్, రత్న కుమార్, దీరజ్ వైద్యుడు స్క్రీన్ ప్లే అందించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో న‌టించారు. మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, పలువురు సహాయక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించ‌గా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై ల‌లిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 విజ‌య్ ఇందులో పార్తిబ‌న్‌, లియోగా రెండు కోణాలున్న పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ రెండింటికీ మ‌ధ్య ఉన్న తేడాని చ‌క్క‌గా చూపించారు. ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా పార్తి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించిన తీరు.. ఆయ‌న లుక్‌, గెట‌ప్ ఆక‌ట్టుకుంటాయి. ఇక లియోగా నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్ర‌లో చ‌క్క‌టి హీరోయిజాన్ని చూపించారు. ప్రస్తుతానికి దసరా సెలవులను పర్ఫెక్ట్‌ గా క్యాష్ చేసుకుంటున్న లియో… ఓటిటిలోనూ  ఈ  జోరు ని ఏ మేరకు కొనసాగిస్తుందో చూడాలి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios