ఇలయదళపతి విజయ్ నటించిన రీసెంట్ మూవీ బీస్ట్ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. కేజిఎఫ్ 2 చిత్రానికి పోటీగా విడుదలైన బీస్ట్ తొలి షో నుంచే ప్లాప్ టాక్ మూటగట్టుకుంది.

ఇలయదళపతి విజయ్ నటించిన రీసెంట్ మూవీ బీస్ట్ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. కేజిఎఫ్ 2 చిత్రానికి పోటీగా విడుదలైన బీస్ట్ తొలి షో నుంచే ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. కానీ విజయ్ క్రేజ్ తో తమిళనాడులో కొంతమేరకు వసూళ్లు వస్తున్నాయి. సినిమా మాత్రం విజయ్ అభిమానులని సైతం నిరాశ పరిచింది. 

భారీ స్థాయిలో బిల్డప్ లతో విడుదలైన బీస్ట్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీనికి తోడు కేజిఎఫ్ 2 ప్రభంజనం కొనసాగుతుండడంతో బీస్ట్ కలెక్షన్స్ కి గండి పడుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. టెర్రరిజం.. హైజాక్ లాంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్ రా ఏజెంట్ గా.. సైనికుడిగా కనిపించాడు. 

తాజాగా బీస్ట్ మూవీపై హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు చేశారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పై విరుచుకుపడ్డారు. అసలు ఇదేం సినిమా అంటూ ధ్వజమెత్తారు. ఓ ఇంటర్వ్యూలో చంద్ర శేఖర్ బీస్ట్ మూవీ గురించి కామెంట్స్ చేశారు. 

బీస్ట్ చిత్రంలో హీరో శ్రమ, ఫైట్ మాస్టర్స్ ప్రతిభ, కొరియోగ్రఫీ మాత్రమే కనిపించాయి. కానీ ఎక్కడా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్రతిభ కనిపించలేదు. చాలా మంది కొత్త దర్శకుడు తమ మొదటి చిత్రం, రెండవ చిత్రాన్ని బాగానే తీస్తారు. కానీ మూడవ చిత్రానికి స్టార్ హీరోల డేట్స్ దొరుకుతాయి. దీనితో గాల్లో తేలిపోతూ.. కనీసం హోమ్ వర్క్, సరైన స్క్రిప్ట్ లేకుండా సెట్స్ కి వచ్చేస్తారు. 

బీస్ట్ విషయంలో కూడా అదే జరిగింది అని చంద్రశేఖర్ విమర్శించారు. బీస్ట్ చిత్రంలో స్క్రీన్ ప్లేపై దర్శకుడు అసలు వర్క్ చేసినట్లు లేదు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ చిత్రానికి స్క్రీన్ ప్లే బలంగా ఉండాలి అని చంద్రశేఖర్ అన్నారు. చంద్రశేఖర్ కూడా స్వయంగా రచయిత, దర్శకుడు. తన కొడుకు సినిమాపైనే చంద్ర శేఖర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.