Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో: గుడిలో రజనీ ...పూజారికి దక్షిణ వేసే విధానం చూడండి

ప్రస్తుతం రజనీకాంత్ గుడిలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రత్యేకం ఆయన దైవ దర్శనం చేసుకోవడం కాదు. ...

Thalaiva Rajinikanth new viedo viral on social media Dakshina to the priest in the temple jsp
Author
First Published Sep 10, 2023, 8:37 AM IST


సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ ఫామ్ లో కి వచ్చాసారు. జైలర్ సినిమాతో మరోసారి అందరీకి చూపించారు. వయస్సుకు సంభందం లేకుండా రజినీకాంత్ వరస  సినిమాలు చేసుకుంటూ… ముందుకు సాగుతున్నాడు. కండక్టర్ గా  జీవితం ప్రారంభించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ తర్వాత… స్టార్ హీరోగా ఎదిగినా అప్పటి అలవాట్లు ఇంకా పోలేదు. ఆ విషయం రీసెంట్ గా ఓ గుడిలో రజనీ దక్షిణ వేసే విధానంలో చూడవచ్చు. . 

తెలుపు రంగు పంచ కట్టుకొని… లాల్చి ధరించి గుడికి వెళ్ళిన సూపర్ స్టార్ రజనీకాంత్… అక్కడ పూజారికి తన స్టైల్ లో… దక్షిణ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది.. లాల్చీ చేతులను మడతపెట్టి అందులో డబ్బులు పెట్టారు. ఆ మడతవిప్పి అందులో నుంచి డబ్బులు తీసిన రజనీకాంత్ పురోహితుడి దగ్గర ఉన్న ప్లేటులో వేశారు. ఈ చిన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్ మాత్రమే ఈ విధంగా ప్లాన్ చేసి దక్షిణ వేయగలరని  ట్వీట్ చేశారు. ఆయనే ఈ వీడియోను ట్విట్టర్‌లో మొదట షేర్ చేశారు. ఇప్పుడు చాలా మంది ఈ వీడియోను ట్వీట్ చేస్తున్నారు. ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా రజనీకాంత్ అంటే రజనీకాంతేనని.. స్టైల్‌కి ఆయన బాబని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.  ఇక ఈ వీడియోను చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్  ఫ్యాన్స్‌ ఫుల్‌ ఫిదా ఆ స్టైల్ కు అవుతున్నారు. 

మరో ప్రక్క  జైలర్ (Jailer) భాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే.   ‘వరుణ్ డాక్టర్’ ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘సన్ పిక్చర్స్‌’ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత అయిన సునీల్ నారంగ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు కలిసి రిలీజ్ చేశారు. ఈ సినిమా కలెక్షన్స్ రోజురోజుకీ పెరగటమే కానీ  ఏ మాత్రం తగ్గ లేదు. రిలీజ్ రోజు నుండే ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో..బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నీరాజనాలు పట్టారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ లో రిలీజ్ అయ్యింది. అక్కడా ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. 
 
'రోబో 2.0' సినిమా తరువాత రజనీ కొట్టిన పెద్ద హిట్ జైలర్. రోబో కు జైలర్ కు మధ్య చాలా సినిమాలు వచ్చాయి కానీ ఏ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. ప్రతీసారి రజనీకాంత్ కొత్త సినిమా వస్తోందంటే అదిరిపోతుందని ఎక్సపెక్టేషన్స్ పెరగటం  ఆతర్వాత తుస్సుమనటం కామన్ అయ్యిపోయింది.  ఆ మధ్య ఆయన చేసిన 'పెద్దన్న' సినిమా కూడా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా తమిళనాట కూడా తన సత్తా చూపలేకపోయింది. ఇక తెలుగులో కూడా వసూళ్ల పరంగా ఆ సినిమా డీలాపడిపోయింది. 

ఆ తరువాత ఆయన నుంచి వచ్చిన సినిమానే 'జైలర్'. అయితే జైలర్ ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసింది. రిలీజ్ రోజునే ఈ సినిమా తన స్థాయిని చాటుకుంది.    రజనీ స్టైల్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ .. ఆయన చేసే మేజిక్ కు సరైన కథ పడటం ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది.  త‌న కొడుకు మ‌ర‌ణంపై ప్ర‌తీకారం తీర్చుకునే రిటైర్డ్ జైల‌ర్‌గా ర‌జ‌నీకాంత్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్‌తో పాటు ఆయ‌నపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నాయి.అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చన జైలర్ సినిమాలో..తమన్నా, రమ్యకృష్ణ,సునీల్,యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాదు మలయాళ సూపర్‌ స్టార్ మోహన్ లాల్‌, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్‌ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios