Asianet News TeluguAsianet News Telugu

'జైలర్' మూవీ క్లోజింగ్ కలెక్షన్లు, ఎన్ని కోట్ల దగ్గర పరుగు ఆపారు ?

త‌న కొడుకు మ‌ర‌ణంపై ప్ర‌తీకారం తీర్చుకునే రిటైర్డ్ జైల‌ర్‌గా ర‌జ‌నీకాంత్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్‌తో పాటు ఆయ‌నపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నాయి.

Thalaiva Rajinikanth Jailer Closing Box Office Collections jsp
Author
First Published Sep 13, 2023, 8:06 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)ఇంత వయస్సు వచ్చినా తన సత్తా ఏంటో మరోసారి  'జైలర్' తో చాటారు.   'జైలర్' (Jailer Movie) సినిమాకు బాక్సాఫీస్ బరిలో వస్తున్న కలెక్షన్స్ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ముఖ్యంగా రజనీకాంత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్  కొన్ని ఇప్పటికి వైరల్ అవుతున్నాయి. మరో ప్రక్క ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ అయ్యి  రికార్డ్స్ బ్రద్దలు కొడుతోంది.  జైలర్ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది.ఈ నేపధ్యంలో ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేది ఆసక్తికరమైన విషయం. 

మూడు రోజుల్లో 200 కోట్లురజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన 'జైలర్'కు పూర్తి స్థాయిలో తమిళనాడులో హిట్ టాక్ లభించింది. తెలుగులో, ఇతర రాష్ట్రాల్లో అబౌవ్ ఏవరేజ్ టు హిట్ టాక్ వచ్చింది. అయితే... రజనీ అద్భుతంగా యాక్ట్ చేశారని పేరు రావడంతో అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. దాంతో మూడు రోజుల్లో సినిమా 200 కోట్ల మార్క్ చేరుకుంది. 

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా వసూళ్ల హోరు చూపింది. రజినీకి చాలా ఏళ్ల తర్వాత బంపర్ హిట్‍ను ఇచ్చింది. తలైవా ఈజ్ బ్యాక్ అంటూ తలైవా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసింది. ఇప్పుడిప్పుడే జైలర్ మూవీ థియేట్రికల్ రన్ పూర్తవుతోంది. దీంతో ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ల లెక్కలు వెల్లడవుతున్నాయి. జైలర్ చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..

 జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. ఈ చిత్రం ట్రిపుల్ లాభాలను తెచ్చిపెట్టిందని ట్వీట్ చేశారు. “జైలర్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్. క్లోజింగ్ కలెక్షన్ రూ.650 కోట్లు. ఈ సినిమాలో భాగమైన అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా మూడు రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది. చరిత్రలో బిగ్గెస్ట్ కమ్‍బ్యాక్‍ను నెల్సన్ దిలీప్ కుమార్ అందించాడు” అని విజయబాలన్ ట్వీట్ చేశారు.
  
'రోబో 2.0' సినిమా తరువాత రజనీ కొట్టిన పెద్ద హిట్ జైలర్. రోబో కు జైలర్ కు మధ్య చాలా సినిమాలు వచ్చాయి కానీ ఏ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. ప్రతీసారి రజనీకాంత్ కొత్త సినిమా వస్తోందంటే అదిరిపోతుందని ఎక్సపెక్టేషన్స్ పెరగటం  ఆతర్వాత తుస్సుమనటం కామన్ అయ్యిపోయింది.  ఆ మధ్య ఆయన చేసిన 'పెద్దన్న' సినిమా కూడా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా తమిళనాట కూడా తన సత్తా చూపలేకపోయింది. ఇక తెలుగులో కూడా వసూళ్ల పరంగా ఆ సినిమా డీలాపడిపోయింది. 

ఆ తరువాత ఆయన నుంచి వచ్చిన సినిమానే 'జైలర్'. అయితే జైలర్ ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసింది. రిలీజ్ రోజునే ఈ సినిమా తన స్థాయిని చాటుకుంది.    రజనీ స్టైల్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ .. ఆయన చేసే మేజిక్ కు సరైన కథ పడటం ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది.  త‌న కొడుకు మ‌ర‌ణంపై ప్ర‌తీకారం తీర్చుకునే రిటైర్డ్ జైల‌ర్‌గా ర‌జ‌నీకాంత్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్‌తో పాటు ఆయ‌నపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నాయి.అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చన జైలర్ సినిమాలో..తమన్నా, రమ్యకృష్ణ,సునీల్,యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాదు మలయాళ సూపర్‌ స్టార్ మోహన్ లాల్‌, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్‌ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios