Asianet News TeluguAsianet News Telugu

సుకుమార్‌లో ఎవరికీ తెలియని మూడు రహస్యాలు ఏంటో తెలుసా?.. సెట్‌లో వాడే ఊతపదం ఇదే..

దర్శకుడు సుకుమార్‌ గురించి తెలియని రహస్యాలు బయటపెట్టింద భార్య తబిత సుకుమార్‌. అంతేకాదు `పుష్ప` సీక్వెల్స్ పై అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చాడు సుకుమార్‌. 
 

thabitha Sukumar revealed three secrets of sukumar and allu arjun also reveals
Author
First Published Aug 21, 2024, 10:39 PM IST | Last Updated Aug 21, 2024, 10:39 PM IST

క్రియేటివ్‌ జీనియస్ దర్శకుడు సుకుమార్‌. హైలీ క్రియేటివ్ గా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. `ఆర్య`తో మెప్పించిన ఆయన ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉన్నారు. ఓ పదేళ్ల తర్వాతి జనరేషన్‌ ఆలోచనలో మెప్పిస్తుంటారు. ఆయన తగ్గి సినిమా చేస్తే ఒక `రంగస్థలం` వంటి హిట్‌ వచ్చింది. `పుష్ప` లాంటి బ్లాక్‌ బస్టర్‌ వచ్చింది. ఇప్పుడు `పుష్ప 2`తో ఇండియాని షేక్‌ చేసేందుకు వస్తున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. డిసెంబర్‌లో విడుదల కాబోతుంది. 

ఇదిలా ఉంటే తాజాగా రావు రమేష్‌ ప్రధాన పాత్రలో నటించిన `మారుతీనగర్‌ సుబ్రమణ్యం` సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇందులో మెయిన్‌ గెస్ట్ గా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వచ్చారు. ఈ మూవీని సుకుమార్‌ భార్య తబిత సుకుమార్‌ సమర్పిస్తున్న నేపథ్యంలో సుకుమార్‌, బన్నీ వచ్చారు. ఈ సందర్భంగా యాంకర్‌ సుమ వీరితో ఫన్‌ చాట్‌ నిర్వహించారు. ఇందులో సుకుమార్‌ గురించి ఎవరికీ తెలియని మూడు సీక్రెట్స్ చెప్పాలని అడగ్గా.. అసలు విషయాలు బయటపెట్టింది తబిత. సుకుమార్‌.. ఆర్గానిక్‌ ఫుడ్‌ని ఇష్టపడతాడట. ఇంట్లో అవే ఎక్కువగా తింటాడట. ఏదైనా ఆర్గానిక్‌ వాటికి ప్రయారిటీ ఇస్తారని తెలిపింది. 

రెండోది చెబుతూ, ట్రావెలింగ్‌ అంటే ఇష్టమని చెప్పింది. ట్రావెల్‌ చేయాలని అనుకుంటారు. కానీ బిజీ లైఫ్‌ కారణంగా అది కుదరదని, ఆయన కాళ్లకి బ్రేకులున్నాయని తెలిపారు తబిత. ఇక మూడోది చెబుతూ, `పుష్ప 2`లో చూసేటి అగ్గిరవ్వ మాదిరి అనే పాట ఉంది కదా, సుకుమార్‌ నిజంగానే అలా ఉంటాడు, కానీ లోపల మాత్రం సాఫ్ట్ గా కనిపిస్తాడని తెలిపింది తబిత. 

ఇందులో బన్నీకి కూడా రహస్యాన్ని బయటపెట్టారు. సెట్‌లో సుకుమార్‌ ఎలా ఉంటాడో చెప్పాడు. `డార్లింగ్‌ వన్‌ మోర్‌` అంటాడట. ఆ సమయంలో మీ రియాక్షన్‌ ఏంటని అడగ్గా, ఎక్స్‌ పెక్ట్  చేశా అంటూ వెల్లడించారు బన్నీ. ఈ సందర్భంగా వీరిమధ్య కన్వర్జేషన్‌ ఫ్యాన్స్ కి ట్రీట్‌లా సాగింది. అరుపులతో వాళ్లు హోరెత్తించారు. బన్నీ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప 2` సినిమా గురించి చెబుతూ, ఎప్పుడూ మీ కాంబినేషన్‌లో ఇలానే రెండు పార్ట్ లు వస్తాయా? అని అడగ్గా, ఇకపై పార్ట్ 1, పార్ట్ 2లు కాదు, ఇలా వస్తూనే ఉంటాయని, పార్ట్ 3 పార్ట్ 4, పార్ట్ 5లు వస్తాయని తెలిపాడు. `పుష్ప`కి ఇంకా సీక్వెల్స్కి వస్తూనే ఉంటాయని చెప్పాడు సుకుమార్‌. కామెడీగా చెప్పాడా లేక సీరియస్‌గానే అసలు విషయాన్ని రివీల్‌ చేశాడా?అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios