Asianet News TeluguAsianet News Telugu

'తార్ మార్ టక్కర్ మార్' లిరికల్ వీడియో.. డ్యాన్స్ కుమ్మేస్తున్నారుగా, విజువల్ ట్రీట్ పక్కా

'నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో గాడ్ ఫాదర్ చిత్రాన్ని విపరీతమైన హైప్ తీసుకువచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

Thaar Maar Thakkar Maar Lyric Video from God Father out now
Author
First Published Sep 21, 2022, 4:31 PM IST

'నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో గాడ్ ఫాదర్ చిత్రాన్ని విపరీతమైన హైప్ తీసుకువచ్చారు మెగాస్టార్ చిరంజీవి. నత్తనడకగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలకు ఈ డైలాగ్ తో ఊపొచ్చింది. మంగళవారం రోజు ఈ డైలాగ్ అన్ని మీడియా ఛానల్స్ లో బ్రేకింగ్ గా మారిపోయింది. 

ఇదే జోష్ లో సాంకేతిక కారణాలతో వాయిదా పడిన 'తార్ మార్ టక్కర్ మార్' లిరికల్ వీడియో కూడా కొద్దిసేపతి క్రితమే రిలీజ్ చేశారు. తమన్ అందించిన మాస్ బీట్ మాస్ కి ఎక్కేసేలా ఉంది. ఈ సాంగ్ లో ప్రధాన విశేషం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కలసి డ్యాన్స్ చేయబోతున్నారు. లిరికల్ వీడియోలో వీరిద్దరూ సెట్స్ లో చేస్తున్న సందడి చూపించారు. 

ప్రభుదేవా ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ అందిస్తుండడం విశేషం. సెట్స్ లో చిరు, సల్మాన్, ప్రభుదేవా ముగ్గురూ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఈ పాటకి శ్రేయా ఘోషల్ గాత్రం అందించగా.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. 

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. సునీల్, సత్యదేవ్, సముద్ర ఖని లాంటి నటులు ఈ చిత్రంలో ఉన్నారు. 

పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి గెటప్ ఈ మూవీలో విభిన్నంగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఆచార్య నిరాశపరచడంతో 'గాడ్ ఫాదర్' చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అక్టోబర్ 5న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios