దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి రూపొందిస్తోన్న చిత్రం 'ఓ బేబీ'. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ వృద్ధురాలు పాతికేళ్ల అమ్మాయిగా మారే కాన్సెప్ట్ తో సినిమా రూపొందింది.

అయితే ఇలాంటి సినిమాలలో ఒకే హీరోయిన్ రెండు గెటప్పులలో కనిపించడం కామన్. కానీ ఈ సినిమాలో ఓల్డ్ గెటప్ కి నటి లక్ష్మిని తీసుకున్నారు. మెయిన్ హీరోయిన్ గా సమంతను తీసుకున్నారు. దీంతో అభిమానుల్లో రెండు పాత్రలు సమంతనే పోషిస్తే మరింత బాగుండేదనే డిస్కషన్లు మొదలయ్యాయి.

నిజానికి యూనిట్ కూడా అలానే అనుకొని సినిమా మొదలుపెట్టిందట.సమంతతోనే రెండు పాత్రలు చేయించాలని అనుకున్నారు. కానీ ఓల్డ్ గెటప్ కోసం సమంతకి ఓ స్పెషల్ మేకప్ వేయాల్సివుంది. ఆ మేకప్ వేయడానికి గంటల కొద్దీ సమయం పడుతుండట.

అప్పటికీ సమంతకు ఆ మేకప్ వేసి టెస్ట్ చేశారట. కానీ ఆ మేకప్ కారణంగా సమంత ముఖానికి  రియాక్షన్ రావడంతో వెంటనే ఆపేసి సీనియర్ నటి లక్ష్మిని తీసుకొచ్చారట. అలా సమంతని ఓల్డ్ గెటప్ లో చూసే ఛాన్స్ మిస్ అయింది.