నిజమెంత?: తెలుగు సినీ నిర్మాత..సొంతంగా న్యూస్ ఛానెల్
అయితే ఇప్పుడో పాపులర్ ప్రొడ్యూసర్ ..టీవీ ఛానెల్ పెట్టబోతున్నారనే వార్త మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త లో ఎంతవరకూ నిజముందో కానీ ...జనాల డిస్కషన్ మాత్రం ఓ రేంజిలో జరుగుతోంది. ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు..టీజి ప్రసాద్.
సినిమావాళ్లకు మీడియా సంస్దలకు మంచి రిలేషన్సే ఉంటాయి. సినిమాల మీద వచ్చే యాడ్స్ ...టీవీ ఛానెల్ ఆదాయంలో ఓ భాగం. అయితే సినిమా వాళ్లు పనిగట్టుకుని టీవీ ఛానెల్ పెట్టినా కాన్సర్టేట్ చేయలేక చేతులెత్తేసిన సంఘటనలు ఉన్నాయి. దాంతో టీవీ ఛానెల్ కన్నా సినిమాలు ఫెరఫెక్ట్ ప్లాట్ ఫామ్ అయిన ఓటీటీల వైపే చూస్తూంటారు. అయితే ఇప్పుడో పాపులర్ ప్రొడ్యూసర్ ..టీవీ ఛానెల్ పెట్టబోతున్నారనే వార్త మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త లో ఎంతవరకూ నిజముందో కానీ ...జనాల డిస్కషన్ మాత్రం ఓ రేంజిలో జరుగుతోంది. ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు..టీజి ప్రసాద్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ స్థాపించి, దానిపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్న టీజీ విశ్వప్రసాద్ చుట్టూ ఈ రూమర్ తిరుగుతోంది. ఆ రూమర్ కు మరింత మసాలా జోడించి...మరీ కథనాలు వస్తున్నాయి. విశ్వప్రసాద్ కు ఓ పెద్ద జాతీయ పార్టీ నుంచి ఆర్థిక సహకారం అందేలా ఉందని, ఆ పార్టీ ప్రోద్బలంతోనే ఆయన న్యూస్ ఛానల్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అంతేకాదు ఇప్పటికిప్పుడు ఛానెల్ కొనటం కష్టం కాబట్టి మహా టీవీ న్యూస్ ఛానెల్ ను కొనేయాలని విశ్వప్రసాద్ ఆలోచన చేస్తున్నారని మరో కోణం కూడా జత చేస్తున్నారు.
అయితే ఈ రూమర్ లాంటి వార్తకు ఆదారం... విశ్వప్రసాద్ తాజాగా పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో ఏకంగా 15 సినిమాల నిర్మాణాన్ని ప్రకటించమే అంటున్నారు. ఆ వార్తను బేస్ చేసుకునే ఈ రూమర్ వండేసారని చెప్పుకుంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ‘వెంకీ మామ’ సహా పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఇపుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి కొత్త టాలెంట్ ఉన్న వాళ్లతో సినిమాలు నిర్మించనున్నారు. అందులో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు, 6 మీడియం రేంజ్ చిత్రాలు, 3 బిగ్ బడ్జెట్ చిత్రాలున్నాయి. ఈ బ్యానర్‌లో కొత్త టాలెంట్ ఉన్న దర్శకులు, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ కూడా పరిచయం కానున్నారు.