ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టైన  చిత్రాల్లో ‘టెర్మినేటర్‌’ సిరీస్‌ ఒకటి. టెర్మినేటర్‌గా ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగ్గర్‌ నటన, ఆయన చేసిన యాక్షన్‌  సీన్స్  ప్రేక్షకులను కట్టిపారేసాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో ఆరో చిత్రం ‘టెర్మినేటర్‌: డార్క్‌ఫేట్‌’ రాబోతోంది. ఈ ఏడాది నవంబరు 1న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  ఈ నేఫధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.

టెర్మినేటర్‌ను పోలి ఉన్న రెవ్‌-9 (గేబ్రియల్‌ లూనా) డ్యానీ (నటాలియా రెయేస్‌)ను చంపాలని యత్నిస్తుంటాడు. డ్యానీని కాపాడేందుకు సారా కోన్నర్‌ (లిండా హ్యామిల్టన్‌), అసలైన టెర్మినేటర్‌ (ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌)తో కలిసి సాయశక్తులా ప్రయత్నిస్తుంది. రెవ్‌-9 నుంచి సారా.. డ్యానీని ఎలా కాపాడింది? అన్నదే ఈ సినిమా కథ. 

71 ఏళ్ల వయసులో ఇప్పుడు మరోసారి ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగర్‌ టెర్మినేటర్‌గా కనిపించబోతుండటం విశేషం.    ‘డెడ్‌పూల్‌’ దర్శకుడు టిమ్‌ మిల్లర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్‌ కేమరూన్‌ నిర్మిస్తున్నారు. 1991లో వచ్చిన ‘టెర్మినేటర్‌ 2: జడ్జిమెంట్‌ డే’కు డైరెక్ట్‌ సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది.  

ఈ చిత్రంలో ఆర్నాల్డ్‌తో పాటు లిండా హామిల్టన్‌, డేవిస్‌, గాబ్రియల్‌ లునా, నటాలియా రేఐస్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  పారామౌంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై జేమ్స్ కెమరూన్‌, డేవిడ్‌ ఎల్లిసన్‌ సంయుక్తంగా నిర్మింస్తున్నారు. నవంబర్‌ 1న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.