గతంలో సోషల్ మీడియాలో కొన్ని ఛాలెంజ్ లు వైరల్ అయ్యాయి. 'కీకీ', 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' వంటి ఛాలెంజ్ లను సెలబ్రిటీలు సవాల్ తీసుకొని ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తాజాగా 'టెన్ ఇయర్ ఛాలెంజ్' ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఛాలెంజ్ ఏంటంటే పదేళ్ల క్రితం తీసుకున్న ఫోటోను, ఇప్పటి ఫోటోను జత చేసి ఈ పదేళ్లలో జరిగిన మార్పు గురించి ప్రస్తావించాలి. ఈ క్రమంలో చాలా మంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ ని స్వీకరించి ఫోటోలను షేర్ చేస్తున్నారు. 

నటి శ్రుతిహాసన్ కూడా ఇందులో భాగమవ్వాలని తన ఫోటోలను షేర్ చేసింది. కానీ నెటిజన్లు మాత్రం శ్రుతికి షాక్ ఇచ్చారు. ఆమె ముఖంలో తేడాలను ప్రస్తావిస్తూ.. ప్లాస్టిక్ సర్జరీ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. శ్రుతి అందంగా కనిపించడం కోసం ముక్కు సర్జరీ చేయించుకుందనే ప్రచారం జరిగింది.

ఇప్పుడు ఆ ప్లాస్టిక్ సర్జరీలను టార్గెట్ చేసిన నెటిజన్లు ఆమెని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీలతో అందంగా మారిందంటూ శ్రుతిపై కామెంట్స్ చేస్తున్నారు. మిగిలిన  తారలపై అంతగా నెగెటివిటీ కనిపించడం లేదు కానీ శ్రుతిని మాత్రం ఓ రేంజులో ఆడుకుంటున్నారు. మొత్తానికి ఛాలెంజ్ స్వీకరించి శ్రుతి ఇరుక్కుపోయింది.