బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో సీబీఐ వేగం పెంచింది. సుశాంత్‌ మరణం కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సుశాంత్‌ ప్రియురాలు రియాపై సీబీపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ప్రధానంగా సుశాంత్‌ని రియా, రియా కుటుంబం మానసికంగా వేధించిందనే ఆరోపణలున్నాయి. దాని వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ వార్తలొస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో సీబీఐ అనేక కోణాల్లో దర్యాప్తు జరుపుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం రియాని విచారిస్తుంది. సీబీఐ టీమ్‌ లీడర్‌ నుపుర్‌ ప్రసాద్‌ నాయకత్వంలోని సీబీఐ బృందం ఈ కేసుని డీల్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ టీమ్‌ రియా కుటుంబాన్ని ప్రశ్నిస్తోంది. రియా..సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు.. అంటే జూన్‌ 8న ఆయనతో గొడవపడి బాంద్రాలోని ఫ్లాట్‌ నుంచి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. 

ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సీబీఐ ప్రధానంగా పది ప్రశ్నలను రియా ముందు ఉంచింది. వాటిని ఓ సారి చూస్తే.. 

1.సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం గురించి ఆమెకి ఎవరు సమాచారం అందించారు? ఆ సమయంలో రియా ఎక్కడుంది?

2.సుశాంత్‌ మరణ వార్త విన్న తర్వాత ఆమె అతని ఫ్లాట్‌కి వెళ్ళిందా? వెళ్లకపోతే, ఆయన భౌతికకాయన్ని ఎక్కడ, ఎలా, ఎప్పుడు చూసింది?

3.జూన్‌ 8న ఆమె సుశాంత్‌ ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది?

4.ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి వెళ్ళిపోయిందా?

5.సుశాంత్‌ ఫ్లాట్‌ నుంచి వెళ్ళిపోయిన తర్వాత జూన్‌ 9 నుంచి 14 మధ్య ఆమెతో ఏదైనా కమ్యూనికేషన్‌ జరిగిందా? జరిగి ఉంటే ఏం మాట్లాడుకున్నారు? కమ్యూనికేషన్‌ జరగకపోతే ఎందుకు జరగలేదు?

6.తన ఫ్లాట్‌ నుంచి రియా వెళ్ళిపోయిన తర్వాత సుశాంత్‌ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించారా? ఆమె సుశాంత్‌ కాల్స్,  మెసేజ్‌లను ఇగ్నోర్‌ చేసిందా? అలా చేస్తే .. ఎందుకు చేసింది? అతన్ని కాల్స్ ని ఎందుకు బ్లాక్‌ చేసింది?

7.సుశాంత్‌ ఆ సమయంలో రియా కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించారా? వారి మధ్య కమ్యూనికేషన్‌ ఏం జరిగింది?

8.సుశాంత్‌ ఆరోగ్య పరమైన సమస్యలేమైనా ఉన్నాయా? ఆయన తీసుకుంటున్న చికిత్స ఏంటి? వైద్యుల, మానసిక వైద్యుల వివరాలేంటి?  ఎలాంటి మందులు వాడేవారు?

9.సుశాంత్‌ కుటుంబంతోరియాకి ఉన్న సంబంధం ఏంటి?

10.మరణంపై సీబీఐ దర్యాప్తు కోసం ఆమె ఎందుకు అడిగింది? గేమ్‌ ప్లే చేయాలని భావించిందా?

ఇలా పది ప్రశ్నలు సీబీఐ ఆమె ఉంచిందని తెలుస్తుంది. సీబీఐ విచారణ తర్వాత ఓ వైపు ఈడీ, మరోవైపు సీబీఐ విచారణలతో రియా విసుగెత్తిపోతుందట. మెంటల్‌ టార్చర్‌గా ఉందంటూ మీడియాతో రియా తెలిపింది. సుశాంత్‌ నుంచి రూ.15కోట్లని రియా తరలించినట్టు ఆరోపణలున్న విషయం తెలిసిందే. దీనిపై ఈడీ సైతం బ్యాక్‌ టూ బ్యాక్‌ విచారిస్తోంది. అలాగే సుశాంత్‌ వంటమనిషి నీరజ్‌ని, రూమ్మేట్‌ సిద్ధార్థ్ పిథానిలను సీబీఐ ప్రశ్నిస్తోంది.