Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ లోకి జానకి కలగనలేదు హీరో.. సీజన్ 7 లో సందడి చేయబోతున్న అమర్ దీప్..?

బిగ్ బాస్ 7 కోసం.. అంతా సిద్దం చేస్తున్నారు మేకర్స్.. అప్పుడే హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ల సెలక్షన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మంది పేర్లు కన్ ఫార్మ్ అయినట్టు  కూడా సమాచారం. 
 

Telugu Serial Hero Amardeep Contestants In Bigg Boss 7 JMS
Author
First Published Mar 28, 2023, 9:11 PM IST

తెలుగులో గత 6 సీజన్లతో అలరిస్తూ ఉంది బిగ్ బాస్ తెలుగు  రియాల్టీ షో. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బిగ్ బాస్ కు గత రెండు మూడు సీజ్ల నుంచి సరిగా రేటింగ్స్ రావడంలేదు. దాంతో.. ఈ షోను ఆడియన్స్ లోకి బలంగా తీసుకెళ్ళడానికి తెగ కష్టపడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే ఈసారి సీజన్ 7ను బాగా ఇంట్రెస్టింగ్ గా తయారు చేయడానకి..కంటెస్టెంట్స్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్. ఈసారి కాస్త ఎక్కువగా డబ్బులు ఖర్చు అయినా సరే.. ఎక్కువ ఇమేజ్ ఉన్న యాక్టర్స్ ను రంగంలోకి దించబోతున్నారట టీమ్. 

 ఇప్పటి నుంచే బిగ్ బాస్ -7లోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ పలువురు సెలబ్రిటీల పేర్లు ఇండస్ట్రీలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో హౌజ్ లోకి రష్మీ, సుధీర్ లతో పాటు హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ ల పేర్లు వినిపించాయి. ఇక సీరియల్స్ నుంచి కూడా మరికొంత మంది పేర్లు వినిపిస్తుండగా.... తాజాగా బుల్లితెర హీరో అమర్ దీప్ పేరు కూడా తెరపైకి వచ్చింది. జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ బిగ్ బాస్ 7 హౌజ్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

జానకి కలగనలేదు సీరియల్ తో పాపులర్ అయ్యాడు అమర్ దీప్ చౌదరి.. బుల్లితెరపై ఎంతో మంది ఫ్యామిలీ అభిమానులను సోంతం చేసుకున్నాడు. గతంలో చాలా సీరియల్స్ చేసినా..అతనికి జానకి కలగనలేదు సీరియల్ బాగా పేరు తీసుకొచ్చింది. అమర్ దీప్ కు చిన్నపాటి హీరోకు ఉన్న ఫాలోయింగ్ ఉంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ ద్వారా అమర్ దీప్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. ఈ సీరియల్ లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అమర్ దీప్ కు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. 

బిగ్ బాస్  తెలుగు 7 లోకి అమర్ దీప్ అడుగుపెడుతున్నాడని వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే ఆయన హౌస్ లోకి వెళ్తే సీరియల్ పరిస్థితి ఏంటీ అంటూ డౌట్ వ్యాక్తం చేస్తున్నారు ఆడియన్స్. అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు అమర్ దీప్.  నేను బిగ్ బాస్ 7కి వెళ్తున్నాను అన్న వార్త విన్నాను. అయితే నాకు సీరియల్ ఉంది. కానీ బిగ్ బాస్ కు వెళ్లడం నా చేతుల్లో లేదు. నేను ప్రస్తుతం సీరియల్ లో బిజీగా ఉన్నాను. మరి బిగ్ బాస్ లోకి పంపించడం లేకపోవడం అనేది మా ఛానల్ ఇష్టం. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి అన్నారు. ఇక ఈసారి హౌస్ లోకి కపుల్ ప్యాకేజ్ కింది. అమర్ దీప్ తో పాటు అతని భార్య తేజస్విని గౌడను కూడా బిగ్ బాస్ 7లోకి పంపుతారని సమాచారం.మరి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios