సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు 2.0 సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చి మంచి కిక్ ఇచ్చాడు. సినిమా అనుకున్నంత స్థాయిలో అన్ని వర్గాల మెప్పించ లేకపోయినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. ఇక 2.0 తరహాలో కాకూడదని రజినీ వేగంగా సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. 

ఇప్పటికే పేట్ట షూటింగ్ పూర్తిచేసిన తలైవా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేశాడు. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. అంతా బాగానే ఉంది కానీ తెలుగు పేట్ట రిలీజ్ ఎప్పుడనేది ఇంకా ఫైనల్ కాలేదు. సంక్రాంతి రిలీజ్ అంటున్నారు గాని సరైన తేదీ ప్రకటించలేదు. 

పైగా ప్రమోషన్స్ కూడా ఇంకా ఉపందుకోలేదు. సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ బయోపిక్ - రామ్ చరణ్ వినయ విధేయ రామ రిలీజ్ కానున్నాయి. ఈ పోటీలో రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందా అనేది సందేహమే. సినిమా ప్రమోషన్స్ రేంజ్ పెరిగితే మంచి ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. మరి సి కళ్యాణ్ రజిని సినిమాను ఏ విధంగా వదులుతారో చూడాలి.