టాలీవుడ్ లో 'ఖడ్గం' అనే సినిమాలో నటించి పేరు సంపాదించుకున్న నటి కిమ్ శర్మ ఆ తరువాత చరణ్ నటించిన 'మగధీర' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది. బాలీవుడ్ లో ఒకప్పుడు అవకాశాలు దక్కించుకున్న ఈ హీరోయిన్ పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరంగా జరిగింది.

కెన్యన్ బిజినెస్ మెన్ అలీ పుంజనిని పెళ్లాడిన ఈ భామ రీసెంట్ గా అతడి నుండి విడాకులు తీసుకుంది. దీంతో తిరిగి ఇండియాకి వచ్చిన ఈ బ్యూటీ ఓ యంగ్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న  కుర్ర హీరో హర్షవర్ధన్ రాణే.. కిమ్ శర్మతో చనువుగా కనిపించడంతో వారిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి.

తాజాగా వీరిద్దరూ కలిసి స్కూటీ మీద ముంబై రోడ్ల మీద కనిపించారు. తరచూ డిన్నర్ లకి, డేట్ కి వెళుతూ కెమెరా కంట చిక్కుతూనే ఉన్నారు. మరి ఈ వార్తలపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి!