బిగ్ బాస్ హౌజ్ లోకి ఎన్టీఆర్ నాటీవీ ద్వారా హౌజ్ మేట్స్ ను పలకరించే హోస్ట్ నేరుగా ప్రత్యక్షం జై లవకుశ ప్రమోషన్ లో భాగంగా హౌజ్ లో కళ్యాణ్ రామ్, రాశి ఖన్నా,నివేదాలు
ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ఇక గ్రాండ్ ఫినాలేకు మరొక్క వారం మాత్రమే మిగిలివుంది. అయితే హౌజ్ లో ఇంకా కంటెస్టెంట్స్ మిగిలి వుండటంతో టైటిల్ పోరుకు అంతా సిద్ధమయ్యారు. నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నారు.
ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ఎపిసోడ్ ప్రారంభించిన ఎన్టీఆర్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘జై లవకుశ’ బ్యూటీస్ నివేదా థామస్, రాశీఖన్నాలు బిగ్‌బాస్ హౌస్‌లో ప్రత్యక్షమై చిత్ర విశేషాలను బిగ్ బాస్ కంటెస్టంట్స్ కి తెలియజేశారు. ఇక బిగ్‌బాస్ హౌస్ ఫేమస్ కుక్ శివబాలాజీ చేత ఆమ్లెట్ చేయించుకుని లొట్టలేసుకుని తినేసింది నివేదా థామస్. ఇక వీరి ముచ్చట్లు సాగుతుండగా.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మరో సర్ ప్రైజ్ గెస్ట్ నందమూరి కళ్యాణ్ రామ్. వచ్చీ రావడంతోటే నాక్కూడా శివబాలాజీ ఆమ్లెట్ కావాలంటూ రుచి చూసి సూపర్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశారు.
బిగ్‌బాస్ సీజన్ 1 టైటిల్ మీ ఆరుగురిలో ఎవరికి వస్తుందని భావిస్తున్నావ్ అంటూ అర్చనను అడగగా... శివబాలాజీ, హరితేజ, నవదీప్‌లలో ఎవరో ఒకరు టైటిల్ విన్నర్ అవ్వొచ్చని తన అభిప్రాయాన్ని తెలియజేసింది అర్చన. ఇక హౌస్‌లో ‘జై లవకుశ’ టీం సందడిని నాటీవీ ద్వారా చూస్తూ వారితో ముచ్చటించారు ఎన్టీఆర్. బిగ్ బాస్ కన్టెస్టెంట్స్ కోసం ‘జై లవకుశ’ మూడు టీజర్స్‌తో పాటు, ట్రైలర్‌ను ప్లే చేసి చూపించారు. ఇక తన తమ్ముడు ఎన్టీఆర్‌తో 2013 నుండి సినిమా తీయాలని ప్రయత్నించామని ఇప్పటికి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లోనే సినిమా తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉందంటూ చిత్ర విశేషాలను తెలియజేస్తుండగా బిగ్ బాస్ హౌస్‌కి సడెన్ ఎంట్రీ ఇచ్చాడు రావణాసురుడు ఎన్టీఆర్.
ఇలా ‘నాటీవీ’ ద్వారానే ఎన్టీఆర్‌ను చూసిన కన్టెస్టెంట్స్ సడెన్‌గా కళ్ల ముందు ప్రత్యక్షం కావడంతో థ్రిల్ ఫీల్ అయ్యారు హౌస్ మేట్స్. బిగ్‌బాస్ హౌస్‌లో జూనియర్ ఎంట్రీ ఇవ్వడంతో ఫుల్ జోష్ ఫుల్ గా మారింది. ఎన్టీఆర్ వచ్చీ రావడంతోటే పంచ్‌లు పేలుస్తూ హౌస్ మేట్స్ కోసం ‘జై లవ కుశ’ అనే వెరైటీ టాస్క్ ఇచ్చారు.. ఈ సినిమాలో తాను పోషించిన మూడు పాత్రలకు సంబంధించిన టీషర్ట్ హౌస్ మేట్స్‌కి అందించి ఆపాత్రలకు తగ్గట్టు నటించాలనే కొత్త టాస్క్ ఇవ్వడంతో ‘జై , లవ, కుశ’ పాత్రల్లో ఇమిడిపోయి నటించారు. వీరితో పాటు నివేదా థామస్, రాశీఖన్నాలు కూడా ఈ టాస్క్‌లో తమ వంతుగా ఓ చేయి వేసి టాస్క్‌ను రక్తికట్టించారు.
ఓవరాల్‌గా కన్టెస్టెంట్స్ ‘జై లవ కుశ’ ఫెర్ఫామెన్స్ ముగిసిన తరువాత గెస్ట్ లుగా వచ్చిన కళ్యాణ్ రామ్, నివేదా, రాశీ ఖన్నాలు వారి ఫెర్ఫామెన్స్‌ని బట్టి మార్క్ కేటాయించారు. ఇందులో అత్యధికంగా ఆమ్లెట్ వేసి ‘జై’ క్యారెక్టర్ చేసిన శివబాలాజీ ఎక్కువ పాయింట్స్ రాగా.. అర్చన అందరికంటే లీస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
,,
ఇక బిగ్‌బాస్ చివరివారంలో కీలకఘట్టమైన ఎలిమినేషన్స్‌కి నామినేట్ అయిన ఆదర్శ్, హరితేజ, అర్చన, దీక్షలలో ఆదర్శ్, హరితేజలు సేఫ్ జోన్‌లో ఉన్నారంటూ వాళ్లకు రిలీఫ్ ఇచ్చారు. దీంతో వారు ఆదర్శ్, హరితేజలు ఫైనల్‌కి చేరారు. ఇక మిగిలిన అర్చన, దీక్షలలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 1 ఫైనల్‌కు చేరేది సండే ఎపిసోడ్‌లో తేలనుంది. అయితే ఇద్దర్నీ ఎలిమినేట్ చేసి డబుల్ డమాకా ట్విస్ట్ కూడా రేపటి ఎపిసోడ్‌లో లేకపోలేదు.
