Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ షోలో మసాజ్ లంటూ మసాలా పెంచేశారు

  • బిగ్ బాస్ హౌజ్ లో కొత్త టాస్క్
  • హోటల్ టాస్క్ లో రఫ్పాడించేస్తున్న గెస్ట్ లు
  • హోటల్ స్టాఫ్ తో మసాజ్ లు చేయించుకుంటూ గ్లామర్ డోస్ పెంచిన గెస్ట్ లు
telugu big boss house masala dose improved

 ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ పై పెదవి విరిచిన జనానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సర్ ప్రైజెస్ ఇస్తున్నారు బిగ్ బాస్. తొలుత పేలవంగా సాగినా.. రాను రాను షోపై ఆసక్తి పెంచేందుకు నిర్వాహకులు తెగ ట్రై చేస్తున్నారు. గత వారం రేటింగ్ కూడా కాస్త తగ్గడంతో షో నిర్వాహకులు కొత్త పంథాలో వెళ్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన నవదీప్‌, దీక్షలకు సీక్రెట్ టాస్క్ ఇచ్చి లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ లో మసాలా పెంచారు.

తాజాగా.. బిగ్ బాస్ స్టార్ హోటల్ పేరుతో ప్రస్తుతం కొత్త టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో నవదీప్, దీక్ష గెస్టులుగా ఉండాలని, ఇతర బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా హోటల్ సిబ్బందిగా ఉండాలని బిగ్ బాస్ ఆదేశించారు. ప్రిన్స్‌ను హోటల్ మేనేజర్‌గా, కార్తీక, హరితేజలను చెఫ్‌లుగా, ముమైత్ ఖాన్‌ను పర్సనల్ అసిస్టెంటుగా, శివ బాలాజీ, ఆదర్శ్, ధనరాజ్, అర్చన వెయిటర్లుగా నియమించారు.

అయితే నవదీప్, దీక్ష పంత్‌లను ప్రత్యేకంగా పిలిచిన బిగ్ బాస్.... హోటల్ సిబ్బంది చిరాకు పడేలా, తాము ఈ పనులు చేయము అనేలా వారిని విసిగించాలంటూ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. దీంతో ఆ ఇద్దరూ రెచ్చిపోయి ప్రవర్తించారు. హోటల్ సిబ్బందికి విసుగు తెప్పించడంలో భాగంగా నవదీప్ దారుణంగా ప్రవర్తించాడు. అర్చనతో కాళ్లకు మసాజ్ చేయించుకున్నాడు. తాను అర్దనగ్నంగా మారుతానని, థాయ్ మసాజ్ చేయాలని డిమాండ్ చేశాడు. తన కాలి బ్రొటన వేలుపై ఉన్న వెంట్రుకలను అర్చన తన పంటితో పీకాలని ఆదేశించాడు. అయితే తాను పంటితో మీ కాలి వెంట్రుకలను పీకలేనని అర్చన తేల్చి చెప్పింది. ఇక ధనరాజ్, ఆదర్శ్, శివ బాలాజీలలో ఎవరైనా అర్దనగ్నంగా మారి తనకు సేవలు చేయాలని నవదీప్ కోరగా.... అందుకు తమ హోటల్ రూల్స్ ఒప్పుకోవని మేనేజర్ ప్రిన్స్ తేల్చి చెప్పారు.

 

ఇక ఇయర్ బడ్స్ వాడితతే తన చెవి నొప్పి పుడుతుందని, అందుకు ఎవరైనా వచ్చి వారి నాలుకతో తన చెవి క్లీన్ చేయాలని నవదీప్ ఆదేశించాడు. ఇలా దారుణమైన కోరికలు కోరుతూ నవదీప్ హోటల్ సిబ్బందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.

మరోవైపు నవదీప్ రేంజిలో కాక పోయినా.... దీక్ష ప్రవర్తన కూడా అదే స్థాయిలో సాగింది. శివ బాలాజీ, ధనరాజ్‌లతో మసాజ్ చేయించుకుంది. వారు ఒంటిపై బట్టలు లేకుండా కేవలం టవల్ మాత్రమే కట్టుకుని తనకు మసాజ్ చేయాలని కోరింది. శివ బాలాజీ, ధనరాజ్ మోకాళ్ల వరకు మసాజ్ చేస్తుంటే... తన తొడలపై సైతం మసాజ్ చేయాలంటూ వారు ఇబ్బంది పడేలా ప్రవర్తించింది.

అయితే గెస్టులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వారికి సేవలు చేస్తూ, వారు అడిగిన గొంతెమ్మ కోరికలు తీరుస్తూ... మెప్పు పొంది ఎక్కువ స్టార్ రేటింగ్ సాధిస్తేనే ఇంటి సభ్యులు ఈ టాస్కులో గెలుపొందుతారు.

 

వచ్చే వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ నుండి సురక్షితులు కావాలంటే..... హోటల్ సిబ్బంది ఇబ్బంది పడేలా తాము ఈ పనులు చేయలేము అనే స్థాయికి వాళ్లను తీసుకెళ్లాలని బిగ్ బాస్ నవదీప్, దీక్షలకు సూచించారు. దీంతో ఎలిమినేషన్ నుండి సురక్షితులు అయ్యేందుకు హోటల్ సిబ్బంది వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios