Asianet News TeluguAsianet News Telugu

హాలీవుడ్ లో తెలుగు హీరో సినిమా.. మొదటిసారిగా ఆ రికార్డు.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్

తొలిసారిగా తెలుగు నటుడు హాలీవుడ్ కు పరిచయం అవుతూ ‘ది డిజర్వింగ్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఫస్ట్ లుక్  విడుదలైన ఆకట్టుకుంది. మూవీ డిటేయిల్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 
 

Telugu Actor Hollywood Debut with The Deserving Movie NSK
Author
First Published Sep 16, 2023, 4:09 PM IST

తెలుగు నటుడిగా హాలీవుడ్ కు పరిచయం అవుతూ హీరో వెంకట్ సాయి గుండ (Venkat Sai Gunda) ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ది డిజర్విగ్’ (Deserving). ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆధ్యాంతం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే సంచలనాత్మకమైన చిత్రమిది. సైకలాజికల్ థ్రిల్లర్ గా హాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్నారు. సినిమా చరిత్రలో ఒక బెంచ్ మార్కును సెట్ చేయడానికి సిద్ధమౌతుంది. నటుడు వెంకట్ సాయి గుండ కేవలం ఈ సినిమాలో హీరోగానే కాకుండా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్ర నిర్మాణంతో హాలీవుడ్ లో తెలుగు ప్రతిభకు పట్టం కట్టాడు.  

హాలీవుడ్ లో ప్రధానపాత్రదారుడిగా ఒక తెలుగు వాడు నటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ గా తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో ప్రపంచ నలుమూలల నుండి ప్రఖ్యాతగాంచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ద్వారా ప్రతిభవంతుడిగా గుర్తింపు పొందిన ఎస్ఎస్ అరోరా రచన దర్శకత్వం వహించారు. అలాగే ఎస్ఎక్స్ఎస్ డబ్ల్యూ ఫిలిం ఫెస్టివల్ తో సహా ప్రఖ్యాత అనేక ప్లాట్ ఫామ్స్ ల నుండి ప్రశంసలు పొందిన కోషి కియోకావా ఈ చిత్రానికి గ్రిప్పింగ్ కథనంతో పాటు సినిమాటోగ్రఫీ అందించారు. 

హాలివుడ్ లో ప్రఖ్యాత సిరీస్ ట్రాన్స్ఫార్మర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన  మ్యూజిక్ డైరెక్టర్  స్టీవ్ జబ్లోన్స్కీ దగ్గర పని చేసి  ఎన్నో అంతార్జాతీయ అవార్డులను కైవస్ చేసుకున్న ప్రసిద్ధ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ Nga Weng Chio(Nga వెంగ్ చియో) "ది డిజర్వింగ్" చిత్రానికి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించారు. చిత్ర పరిశ్రమపైన ప్యాషన్ తో హీరో వెంకట్ సాయి గుండ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో నిర్మించడం గొప్ప విషయం. 

నటుడు వెంకట్ సాయి గుండ గతంలో ‘వద్దంటే వస్తానంటావే ప్రేమ’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ‘ది డిజర్వింగ్’ మూవీతో వస్తున్నారు. ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగులోనూ విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకట్ సాయి గుండతో పాటు సిమోన్ స్టాడ్లర్, కెల్సీ స్టార్ట్లర్, తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కథా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ సాయి గుండ, విస్మయ్ కుమార్, తిరుమలేష్ గుండ్రాత్ నిర్మిస్తున్నారు. ఇక చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. కొందరు హీరో పీకపిసుకుతూ చంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు వదిలిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Telugu Actor Hollywood Debut with The Deserving Movie NSK

Follow Us:
Download App:
  • android
  • ios