బుల్లితెరకు చెందిన ఓ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కరోనా కష్టకాలంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. దీనితో యువజంట వివాహ వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కన్నడ బుల్లితెర పరిశ్రమకు చెందిన నటుడు బాలు అలియాస్ చందన్ కుమార్, సీరియల్ నటి కవిత గౌడ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే వీరిద్దరూ సింపుల్ గా నిశ్చితార్థం జరుపుకున్నారు. 

కాగా కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య శుక్రవారం వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. కన్నడ లక్ష్మీ బారమ్మ 2013 సీరియల్లో వీరిద్దరూ చిన్ను, చందుగా ప్రధాన పాత్రలు పోషించారు. అప్పటి వీరి పరిచయం ప్రేమగా మారింది. దీనితో గత ఎనిమిదేళ్లుగా చందన్ కుమార్, కవిత గౌడ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. 
 

 ఇక పెళ్లి అనంతరం చందన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఆంక్షలు అన్ని ఎత్తివేసి, సాధారణ పరిస్థితులు రాగానే అందరిని పిలిచి గ్రాండ్‌గా రిసెప్షన్‌ పార్టీ నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపాడు. తమ పెళ్లిని ముందుగా అనుకున్న ముహూర్తానికి జరిపించాలని కుటుంబ సభ్యులంతా నిర్ణయించారని, దీంతో కరోనా నియమాల మధ్య, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ తమ వివాహ తంతు జరిపించినట్లు చందన్‌ వెల్లడించాడు.   

సినీ ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అయితే మాస్క్‌తో తమ వివాహ శుభకార్యంలో పాల్గొన్న వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.