Asianet News TeluguAsianet News Telugu

నానికి పెరుగుతున్న సపోర్ట్.. బహిరంగ క్షమాపణ

ఓటిటి, థియేటర్ యాజమాన్యాల నడుమ నేచురల్ స్టార్ నాని బలిపశువుగా మారాడు. తాను నటించిన టక్ జగదీశ్ చిత్రం ఓటిటిలో రిలీజ్ కావడం నానికి కూడా ఇష్టం లేదు.

Telangana Theatres Association gives clarity over Nani issue
Author
Hyderabad, First Published Aug 21, 2021, 3:56 PM IST

ఓటిటి, థియేటర్ యాజమాన్యాల నడుమ నేచురల్ స్టార్ నాని బలిపశువుగా మారాడు. తాను నటించిన టక్ జగదీశ్ చిత్రం ఓటిటిలో రిలీజ్ కావడం నానికి కూడా ఇష్టం లేదు. కానీ నిర్మాతల నిర్ణయాన్ని కాదనలేక, ఇటు ఓటిటి రిలీజ్ ని అడ్డుకోలేక నాని తీవ్ర ఆవేదనతో ఇటీవల ఫ్యాన్స్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

తన టక్ జగదీష్ చిత్రాన్ని నాని థియేటర్స్ లోనే చూడాలనుకున్నాడు. కానీ ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా టక్ జగదీష్ చిత్రాన్ని నిర్మించిన షైన్ స్క్రీన్ సంస్థ తప్పక ఓటిటి నిర్ణయం తీసుకున్నాడు. టక్ జగదీశ్ ఓటిటిలో రిలీజ్ అవుతున్న రోజే నాగ చైతన్య లవ్ స్టోరీ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లకు పెద్ద దెబ్బ. 

రెండు క్రేజీ చిత్రాలు విభిన్నంగా ఒకటి ఓటిటిలో ఒకటి థియేటర్ లో రిలీజ్ అయితే కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుంది. దీనితో తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ తరుపున ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొందరు నాని సినిమాల్లోనే హీరో అని రియల్ లైఫ్ లో పిరికివాడు అని నిందించారు. 

నాని తప్పులేకున్నా ఈ వ్యవహారంలో బలిపశువుగా మారాడు . దీనితో అభిమానుల్లో నానిపై మద్దత్తు పెరుగుతోంది. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ, నిర్మాత సునీల్ నారంగ్ స్పందించారు. ఈ వ్యవహారం నానిని నిందించడం తగదని అన్నారు. 

తాజాగా తెలంగాణ థియేటర్ అసోసియేషన్ బహిరంగ లేఖ విడుదల చేసింది. కొందరు ఎగ్జిబిటర్లు తమ ట్రేడ్ దెబ్బతింటుంది ఏమో అనే భయంతో వ్యక్తిగత విమర్శలు చేశారు. అందుకు క్షమాపణలు చెప్బుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. నాని పేరు వాడకుండా క్షమాపణలు తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios