తెలంగాణ పోలీసులు మరో సారి సినీ స్టార్‌ని వాడుకున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, అల్లు అర్జున్‌, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల క్లిప్ లతో ట్రాఫిక్‌రూల్స్, కోవిడ్‌ నిబంధనలు ప్రచారం చేశారు. ఇప్పుడు మహేష్‌ని వాడుకున్నారు. ప్రజలకు చెప్పాల్సిన అత్యవసర విషయాన్ని మహేష్‌ డైలాగ్‌తో పలికించారు. కోవిడ్‌19పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు. కాస్త క్రియేటివిటీగా, జనాల్లోకి ఈజీగా వెళ్లే విధానాలను ఫాలో అవుతున్నారు. 

అందులో భాగంగా ఇప్పుడు మహేష్‌ నోట కరోనా రూల్స్ ని చెప్పించారు. మాస్క్ లేకపోతే ఏమవుతుందో, కరోనా సోకితే ఏం జరుగుతుందో వివరిస్తున్నారు. ఓ డైలాగ్ వీడియో చేయించి విడుదల చేసింది పోలీస్‌ శాఖ. `జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్‌ జోన్‌లో పడేశాడు. బీ అలర్ట్‌, ప్రొటెక్టర్‌ యువర్‌ సెల్ఫ్‌... వేర్‌ మాస్క్` అనే డైలాగ్స్‌ మహేష్‌తో చెప్పించారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉంటే మహేష్‌ నుంచి త్వరలో రెండు గిఫ్ట్ లు రాబోతున్నాయి. సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజుని పురస్కరించుకుని మే 31న ఫ్యాన్స్ కి డబుల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు మహేష్‌. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `సర్కారువారి పాట` ఫస్ట్ లుక్‌తోపాటు టీజర్‌ని విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతోపాటు త్రివిక్రమ్‌తో ఓసినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ అప్‌డేట్‌గానీ, సినిమా ప్రారంభోత్సవం గానీ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. `సర్కారు వారిపాట`లో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

మహేష్‌ చివరగా `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించారు. గత సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఇందులోని మాస్‌ సాంగ్‌ `మైండ్‌ బ్లాక్‌ మైండ్‌ బ్లాక్‌.. `తాజాగా అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. వంద మిలియన్స్ వ్యూస్‌ సాధించిన పాటగా నిలిచింది. 100 మిలియన్స్ వ్యూస్‌ క్లబ్‌లోకి చేరింది.