ఎన్టీఆర్, ప్రభాస్ లకు తలసాని ఛాలెంజ్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Aug 2018, 1:38 PM IST
telangana minister talasani challenge to tollywood celebrities
Highlights

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐటి మినిష్టర్ కేటీఆర్, అతడి సోదరి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని స్ఫూర్తిగా నిలిచారు.

ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్టార్ హీరోలకు సవాల్ విసిరాడు. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ శ్రీనివాస్ విసిరిన  ఛాలెంజ్ ను స్వీకరించిన తలసాని తాజాగా తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలను నాటారు.

అనంతరం సినీ ప్రముఖులు ఎన్టీఆర్, ప్రభాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు లకు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనమని సవాల్ విసిరారు. మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 

loader