Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు, కారణం ఏంటంటే..?

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కు తెలంగాణ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఆయన కు ఎందుకు నోటీసులు అందాయి.. కారణం ఏంటంటే..? 

Telangana High Court notice to director Raghavendra rao JMS
Author
First Published Nov 10, 2023, 9:06 AM IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు తెలంగాణా హైకోర్ట్ నుంచి నోటీసులుఅందాయి. ఓభూమికి సబంధిచిన వివాదంలో ఆయనకు నోటీసులు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన భూమిని ఆయన సొంత అవసరాలు వాడుకున్నారన్న ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు రాఘవేంద్ర రావు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని దర్శకుడు రాఘవేంద్రరావు సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. రాఘవేంద్ర రావుకు, ఆయన బంధువులకు మరోసారి నోటీసులు జారీ చేసింది. 

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ప్రాంతంలోని షేక్‌పేటలో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం  కేటాయించింది.  అయితే అది ఇండస్ట్రీ డెవలప్ మెంట్ కోసం కాకుండా.. తన సొంత అవకసరాలకోసం దర్శకుడు వాడుకున్నారని ఆరోపణ. కాగా, ఈ పిటిషన్‌పై కోర్టు గతంలో ఓమారు నోటీసులు జారీ చేసినా, అవి వారికి అందినట్లుగా రికార్డుల్లో లేకపోవడంతో గురువారం మళ్లీ నోటీసులు ఇచ్చింది. అంతే కాదు ఈకేసుకు సంబంధించిన తదుపరి విచారణను  న్యాయస్థానం జనవరి 18కి వాయిదా వేసింది. 

రాఘవేంద్ర రావు పై మెదక్‌కు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012లో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సర్వే నెం.403/1లోని 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కృష్ణమోహన్ రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి నోటీసులిచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios