Asianet News TeluguAsianet News Telugu

రజాకార్ విడుదలపై హైకోర్టు కీలక ఆదేశాలు... ఇంతకీ ఏం చెప్పారు!

చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన రజాకార్ మూవీ విడుదల ఆపివేయాలంటూ వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టి వేసింది. దాంతో రజాకార్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. 
 

Telangana high court dismisses rit petition on razakar movie ksr
Author
First Published Mar 14, 2024, 12:18 PM IST


రజాకార్ చిత్ర విడుదలపై స్టే విధించాలంటూ దాఖలైన రిట్ పిటిషన్ ని తెలంగాణ హై కోర్ట్ కొట్టి వేసింది. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్(APCR) ప్రతినిధిగా మహమ్మద్ వసిక్ నదీమ్ ఖాన్ రిట్ పిటిషన్ వేయడమైంది. రజాకార్ మూవీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం కలదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేవలం చిత్ర ట్రైలర్ చూసి రజాకార్  మూవీ కంటెంట్ పై ఒక అభిప్రాయానికి రావడం సరికాదని కోర్ట్ అభిప్రాయపడింది. విడుదల ఆపడం కుదరదని తీర్పు వెల్లడించింది. 

అలాగే రజాకార్ మూవీ సెన్సార్ సర్టిఫికెట్ పొందిన విషయాన్ని గుర్తు చేసింది. రజాకార్ మూవీలోని సన్నివేశాలు, హింస, మాటలు, యుద్ధ సన్నివేశాలు మతాల మధ్య విద్వేషాలు రగించేలా ఉన్నాయని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. కోర్టు పిటిషనర్ వాదనలు తోసిపుచ్చింది. రజాకార్ మూవీ మార్చి 15న విడుదల కానుంది. 1948లో జరిగిన హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 

రజాకార్ లు హిందువులపై మారణకాండకు పాల్పడ్డారని, అరాచక పాలన సాగించారనేది ఈ చిత్ర సారాంశం. రజాకార్ మూవీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే విడుదల కావాల్సింది. అనేక అవరోధాలు ఎదురవుతూ వచ్చాయి. రజాకార్ చిత్రానికి యాటా సత్యనారాయణ దర్శకుడు. బాబీ సింహ, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే కీలక రోల్స్ చేశారు. కామారెడ్డిలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే గూడూరు రమణారెడ్డి ఈ చిత్ర నిర్మాత కావడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios