ఆర్డీఎక్స్ లవ్ చిత్ర కథ పాయల్ రాజ్ పుత్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఏఈ చిత్ర టీజర్ విడుదలైనప్పుడు అనేక విమర్శలు ఎదురయ్యాయి. బోల్డ్ కామెంట్స్, శృంగార సన్నివేశాలు శృతి మించాయని విమర్శలు తలెత్తాయి. కానీ ట్రైలర్ మాత్రం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో పాయల్ రాజ్ పుత్ పాత్రని హైలైట్ చేస్తూ చూపించారు. 

ఈ చిత్రంలో ఏదో ఆసక్తికర పాయింట్ ఉందనే అంచనాలు మొదలయ్యాయి. పాయల్ రాజ్ పుత్ చెబుతున్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ట్రైలర్ లాంచ్ సందర్భంగా పాయల్ రాజ్ పుత్ ని ఉద్దేశిస్తూ తేజుస్ కంచర్ల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

హీరోయిన్ బోల్డ్ గా డైలాగులు చెప్పడం తెలుగులో ఇదే తొలిసారి అని తేజుస్ తెలిపాడు. ఏఈ చిత్ర టీజర్ విడుదలైనప్పుడు అందరూ విమర్శించారు. కానీ ట్రైలర్ చూశాక అభిప్రాయం మారుతుంది అని తేజుస్ అభిప్రాయపడ్డాడు. 

పాయల్ గురించి మాట్లాడుతూ.. పాయల్ ఈ చిత్రంలో బాగా కోపరేట్ చేసింది. కోపరేట్ చేసింది అంటే బాగా చేసింది అని అర్థం.. మీరు వేరేలా అనుకోవద్దు అని సరదాగా కామెంట్ చేశాడు. ఆ సమయంలోవెనుకనే ఉన్న పాయల్ అతడి గొంతు పట్టుకుంది. ఈ సరదా సన్నివేశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.