బిగ్ బాస్ సీజన్2 ఆరో ఎలిమినేషన్ లో బయటకు వచ్చిన తేజస్వి ఇప్పుడు అదే షోపై సంచలన కామెంట్స్ చేస్తోంది. హౌస్ నుండి ఎలిమినేట్ అయి వచ్చే వారందరూ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం కామన్ గా జరుగుతుంటుంది. ఇదే క్రమంలో ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది తేజస్వి. టీఆర్ఫీ రేటింగ్స్ కోసం బిగ్ బాస్ షోలో నన్ను నెగెటివ్ గా చూపించారంటూ చెప్పుకొచ్చింది.

''రోజులో 24 గంటల్లో జరిగిన దాంట్లో వాళ్లకు నచ్చిన గంట సేపు ఎడిట్ చేసి ఆడియన్స్ కు చూపిస్తున్నారు. నేను 100 మంచి పనులు చేస్తే 3 చెడ్డ పనులు చేసి ఉంటాను. కానీ ఆ మూడింటినే హైలైట్ చేసి చూపించారు. సామ్రాట్, నేను, తనీష్ మొదట్ల చాలా క్లోజ్ అయిపోయాం. మేము క్లోజ్ ఎలా అయ్యామనే విషయాలను చూపించకుండా.. ఓ గ్యాంగ్ ఫామ్ చేసినట్లు చూపించారు. సామ్రాట్ తో నా ఎపిసోడ్ హైలైట్ అవుతుందని మా ఇద్దరం క్లోజ్ గా ఉన్నప్పటి సిట్యుయేషన్స్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేసి మరీ చూపించారు. సామ్రాట్ నాకు ఎనిమిదేళ్ల క్రితమే తెలుసు.

కానీ తన పెర్సనల్ లైఫ్ లో ఏం జరిగిందో నాకు తెలియదు. హౌస్ లోకి వచ్చిన తరువాత మొత్తం చెప్పాడు. తనను అందరూ నెగెటివ్ గా అనుకున్నారని.. బాధ పడ్డాడు. కౌశల్ విషయంలో ఒక ఇష్యూ అయింది దానికి సారీ కూడా చెప్పాను. కానీ హౌస్ లో తన ప్రవర్తన మాత్రం నాకు నచ్చేది కాదు.. తను స్వార్ధపరుడు. కౌశల్ విషయం కానివ్వండి, మరో విషయం కానివ్వండి, నాని రెండు, మూడు వారాలుగా నాకు క్లాస్ తీసుకుంటూనే ఉన్నారు. మొదట రెండు వారాలు నిజమేనేమో నేను తప్పుగా ప్రవర్తిస్తున్నానేమో అనుకున్నా.. ఆ తరువాత కొంచెం సైలెంట్ గా ఉన్నా.. మళ్లీ నాని నన్ను తిట్టారు. అప్పుడు అర్ధమైంది నాని కూడా నన్ను మోసం చేస్తున్నారు అని.

ఆయన కూడా ఎడిటెడ్ వెర్షన్ చూసి నాతో మాట్లాడేవారు. నేను కోప్పడే సందర్భాలు, గొడవ పడే విషయాలే చూపించి ఆడియన్స్ దృష్టిలో నన్ను బ్యాడ్ చేసేశారు. ఆయన మాట్లాడితే జనాలు కూడా నిజమనే అనుకుంటారు కదా.. హౌస్ లో నుండి బయటకు వచ్చి భాను, శ్యామల కూడా నా గురించి నెగెటివ్ గా మాట్లాడడం తెలిసి షాక్ అయ్యాను. అంత క్లోజ్ గా ఉండి నా గురించి వాళ్లు అలా మాట్లాడుతున్నారంటే నాకు నమ్మకద్రోహంగా అనిపిస్తుంది'' అంటూ చెప్పుకొచ్చింది.