బిగ్ బాస్ షో పెద్ద స్కామ్.. తేజస్వి తండ్రి సంచలన ఆరోపణలు

tejaswi father comments on bigg boss show
Highlights

తేజస్వి పోల్ అయిన ఓట్లలో కనీసం మూడో స్థానంలో కూడా లేకపోవడంతో నూతన్, శ్యామలలను ఫైనల్ చేశారు. వీరిద్దరి హౌస్ లోకి వెళ్లడం పట్ల తేజస్వి తండ్రి కొన్ని సంచనల కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షో పెద్ద స్కామ్ అని, వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం వారు ఆక్షన్ పెట్టారని ఆరోపణలు చేశారు

బిగ్ బాస్ సీజన్ 1 తో పోలిస్తే.. సీజన్ 2 లో వివాదాలు ఎక్కువయ్యాయి. ఏదైనా జరగొచ్చు అన్న ట్యాగ్ లైన్ దీనికి యాప్ట్ అనే చెప్పాలి. ఇక వివాదాలు అన్ని సద్దుమణిగాయని అనుకునేలోపు మరొక వివాదం చోటుచేసుకోవడం ఇప్పుడు షోపై ఆసక్తి మరింత పెరిగేలా చేస్తుంది. అయితే ఈ షోలో ఆరువారాల గాను ఆరుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

వీరిలో ఒకరిని హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. హౌస్ లోకి వెళ్లడానికి తేజస్వి, శ్యామల, నూతన్ నాయుడు సోషల్ మీడియాలో కాంపెయిన్ నిర్వహించారు. వీరిలో తేజస్వి హౌస్ లోకి వెళ్లడానికి భారీగా ఖర్చు చేసినట్లు టాక్. కానీ ప్రేక్షకుల్లో ఆమెకున్న వ్యతిరేకత కారణంగా ఓట్లు నమోదు కాలేదు. శ్యామల, నూతన్ నాయుడులకు ఓట్లు సమానంగా రావడంతో వారిద్దరిని హౌస్ లోకి పంపారని తెలుస్తోంది.

నిజానికి తేజస్విని కూడా హౌస్ లోకి పంపాలనే నిర్వాహకులు ఇద్దరితో ఎంట్రీ ఇప్పించాలనే నిర్ణయానికి వచ్చారట. కానీ తేజస్వి పోల్ అయిన ఓట్లలో కనీసం మూడో స్థానంలో కూడా లేకపోవడంతో నూతన్, శ్యామలలను ఫైనల్ చేశారు. వీరిద్దరి హౌస్ లోకి వెళ్లడం పట్ల తేజస్వి తండ్రి కొన్ని సంచనల కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షో పెద్ద స్కామ్ అని, వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం వారు ఆక్షన్ పెట్టారని ఆరోపణలు చేశారు. మరి ఈ విషయంపై షో నిర్వాహకులు గానీ నాని గానీ స్పందిస్తారేమో చూడాలి!  

loader