బిగ్ బాస్2: తేజస్వి ఎలిమినేట్ కానుందా..?

Tejaswi eliminated from big boss 2?
Highlights

తేజస్వి కూడా శనివారం ఎపిసోడ్  లో ఓ టాస్క్ లో భాగంగా కౌశల్ ఎపిసోడ్ కారణంగా తనపై ప్రేక్షకుల్లో నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేసిందని, ఈ వీక్ తను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు నిజంగానే తేజస్వి బయటకు వచ్చేసిందని సమాచారం

బిగ్ బాస్ హౌస్ లో ఆరో ఎలిమినేషన్ జరగనున్న సంగతి తెలిసిందే. ఐదుగురు కంటెస్టెంట్లు నామినేట్ కాగా అందులో ముగ్గురు సేఫ్ జోన్ లో ఉండగా తేజస్వి, సామ్రాట్ లలో ఒకరు ఎలిమినేట్ కానున్నట్లు నాని ప్రకటించారు.

దీంతో వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే షో నుండి తేజస్వి ఎలిమినేట్ అవబోతుందనే విషయం ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఆదివారం ఎపిసోడ్ ను ఒకరోజు ముందుగానే షూట్ చేస్తుండడంతో ఎలిమినేషన్ కు సంబంధించిన సంగతులు ముందుగానే లీక్ అవుతున్నాయి.

తేజస్వి కూడా శనివారం ఎపిసోడ్  లో ఓ టాస్క్ లో భాగంగా కౌశల్ ఎపిసోడ్ కారణంగా తనపై ప్రేక్షకుల్లో నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేసిందని, ఈ వీక్ తను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు నిజంగానే తేజస్వి బయటకు వచ్చేసిందని సమాచారం. ఆమె హౌస్ నుండి బయటకు వచ్చిన అనంతరం అభిమానులతో దిగిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. 

loader