షాక్.. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ అవుట్

Teja walked out from NTR Biopic
Highlights

షాక్.. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ అవుట్

ఎన్టీఆర్ బయోపిక్ నుండి వైదొలిగిన డైరెక్టర్ తేజ. ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న తనయుడు బాలక్రిష్ణ .  భారీ స్టార్ క్యాస్ట్ తో తెరుకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్. అసలు విషయంలోకి వెళితే.. సినిమా మే నెల నుండి స్టార్ట్ కానున్న సమయంతో తేజు ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగాడు. తేజు ఈ సినిమా స్ట్రిప్ట్ వర్క్ కోసం ఆరు నెలలు కష్టపడ్డాడు. కథను ఓ పట్టాన తీసుకువచ్చాడు. బాలక్రిష్ణ స్ట్రిప్ట్ విషయంలో కొంచెం అసంతృప్తికరంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రెజర్ తట్టుకోలేక గత 15 రోజులుగా తేజ మదనపడుతున్నాడట. గత 15 రోజులుగా బాలయ్యకు ఇదే సంగతి చెప్పుకొచ్చాడంట. ఎట్టకేలకు ఎన్టీఆర్ బయోపిక్ నుండి వైదొలిగాడు అని సమాచారం. మరో రెండు మూడు రోజులలో అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్న తేజ.

loader