జయ సింహ సినిమా షూటింగ్ లో బిజీగా బాలయ్య తదుపరి సినిమా తేజ దర్శకత్వంలో అంటూ ప్రచారం ఎన్టీఆర్ బయోపిక్ మీద సినిమా తీస్తారంటూ టాక్
‘ నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు దర్శకుడు తేజ. ఆ సినిమాలో హీరో రానా క్యారెక్టరైజేషన్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో తేజ తన తర్వాతి సినిమా ఎవరితో చేస్తారా అనే ఆసక్తి మొదలైంది. ఇదిలా ఉంటే.. తేజ తదుపరి సినిమా బాలయ్యతోనే అంటూ టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం మొదలైంది.
ప్రస్తుతం బాలకృష్ణ.. కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘జయసింహ’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వత సినిమా తేజతో చేయాలని బాలయ్య భావిస్తున్నాడట. అందుకే తరచూ తేజను కలుస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇదే నిజమైతే డిసెంబర్ లో తేజ- బాలయ్య కాంబినేష్లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘ ఎన్టీఆర్’ బయోపిక్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకి చెక్ పెట్టడానికే బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
