Hanuman Trailer : బిగ్ అప్డేట్ ఇచ్చిన తేజా సజ్జా.. ‘హనుమాన్’ ట్రైలర్ కు డేట్ ఫిక్స్
యంగ్ హీరో తేజా సజ్జా సూపర్ హీరోగా అలరించబోతున్న చిత్రం Hanuman. త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja) నటిస్తున్న సూపర్ హీరో ఫిల్మ్ ‘హను మాన్’ (Hanu Man). చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈచిత్ర టీజర్ విజువల్ వండర్ గా నిలిచింది. మూవీపై భారీ హైప్ ను క్రియేట్ చేసింది. యువ హీరో ఈసారి అద్భుతం చేయబోతున్నాడని ప్రముఖులు అంచనా వేస్తున్నారు.
సరిగ్గా నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ను మేకర్స్ ప్రారంభించారు. అభిమానులు, ఆడియెన్స్ కు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు. ‘హనుమాన్’ నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ (Hanuman Trailer) విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. డిసెంబర్ 19న ఈ ట్రైలర్ రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలోని విజువల్స్, గ్రాఫిక్ వర్క్, ఆకట్టుకునే సన్నివేశాలను వీక్షించేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక ప్రతి ఫెస్టివల్, స్పెషల్ డేస్ లో తేజా సజ్జా చిత్రం నుంచి ఏదోక అప్డేట్ వస్తూనే ఉంది. ఆ మధ్యలో చిల్డ్రన్స్ డే సందర్భంగా సర్ ప్రైజ్ ఇచ్చారు. చిత్రం నుంచి Super Hero Hanu Man అనే సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతానికి మూవీ నుంచి ఇదే మొదటి పాట కావడం విశేషం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండటంతో అప్డేట్లను కూడా అన్నీ భాషల్లో వదులుతున్నారు.
ఇక ఏకంగా 11 దేశాల్లో రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది. వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.