Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ నిర్ణయం ...నిర్మాతకు పెద్ద నష్టమే

రీసెంట్ గా ప్రీ రిలీజ్ పంక్షన్ సైతం జరుపుకున్న ఈ సినిమా హఠాత్తుగా రిలీజ్ ఆపటంతో చాలా నష్టమే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్లీ రిలీజ్ టైమ్ లో ప్రమోషన్స్ ప్రారంభించాలి. 

Teja Sajja Ishq postponed JSP
Author
Hyderabad, First Published Apr 21, 2021, 1:38 PM IST

కరోనా విజృంభణతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. ధైర్యం చేద్దామనుకున్న వాళ్లు సైతం బ్రేక్ వేసినట్లుగా ఆగిపోతున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం ..ఏప్రిల్‌ 23న విడుద‌ల కావాల్సిన ఇష్క్ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు‌. దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై.. తేజ స‌జ్జా‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఇష్క్‌'.

రీసెంట్ గా ప్రీ రిలీజ్ పంక్షన్ సైతం జరుపుకున్న ఈ సినిమా హఠాత్తుగా రిలీజ్ ఆపటంతో చాలా నష్టమే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్లీ రిలీజ్ టైమ్ లో ప్రమోషన్స్ ప్రారంభించాలి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్జిబిటర్స్ ఎలా రెస్పాండ్ అవుతారో తెలియని పరిస్దితి. కానీ వేరే దారి లేక రిలీజ్ ఆపేసారు. అప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలైన  రాత్రిపూట కర్ఫూ ,50 శాతానికి థియేట‌ర్ల ఆక్యుపెన్సి త‌గ్గించ‌డం రెండు సినిమా కలెక్షన్స్ పై భారీగా ఇంపాక్ట్ చూపుతాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ.. ''దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు త‌గిన మార్గ నిర్దేశకాలు విడుద‌ల‌ చేశాయి. అందులో భాగంగా ఏపీలో 50 శాతానికి థియేట‌ర్ల ఆక్యుపెన్సి త‌గ్గించ‌డం, తెలంగాణ‌లో రాత్రి పూట క‌ర్ఫ్యూ విధించ‌డం జ‌రిగింది. ఇలాంటి టైమ్‌లో సినిమా రిలీజ్‌ చేయ‌డం కరెక్ట్ కాద‌ని భావించి ఈ నెల 23న విడుద‌ల‌ కావాల్సిన 'ఇష్క్' చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. ప‌రిస్థితుల‌న్నీ అనుకూలించిన తర్వాత కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం" అన్నారు.
  
నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సంస్థ నుంచి వచ్చిన ‘సుస్వాగతం’ తరహాలో యువతరానికి సంబంధించిన ఓ మంచి సందేశం ఉన్న చిత్రమిది. కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. తేజ ‘ఓ బేబి’, ‘జాంబీరెడ్డి’ లాంటి మంచి కథల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. తను ఇందులో చక్కటి నటనని ప్రదర్శించాడు’’ అన్నారు.

ఈ సినిమాతో ఎస్‌.ఎస్‌.రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఆర్‌.బి.చౌదరి సమర్పకులు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios