బాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్ చేసిన హనుమాన్ మూవీ, ఎంత వసూలు చేసిందంటే..?

చిన్న సినిమాగా వచ్చి.. దుమ్మురేపుతోంది హనుమాన్  సినిమా. పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ రచ్చ చేస్తోంది. బాలీవుడ్ లో కలెక్షన్ల హాఫ్ సెంచరీ కొట్టింది హనుమాన్. ఈసందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు. 
 

Teja Sajja Hanuman Movie Bollywood Box Office Collection Viral JMS

హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. హ్యాపీగాఉననారు మూవీ టీమ్. తను ఈసినిమా తను అనుకున్నదాని కంటే కూడా డబుల్ రిజల్ట్ ను అందించడంతో సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అటు తేజ సర్జకు కూడా హానుమాన్ మూవీతో మంచి బ్రేక్ రావడంతో.. టీమ్అంతా హ్యాపీగా ఉన్నారు. అప్పటి వరకూ చిన్న హీరో.. చిన్న డైరెక్టర్ అనిపించుకున్న వారు.. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. అటు దర్శకుడు ప్రశాంత్ వర్మకు.. ఇటు తేజా సర్జకు వరుస ఆఫర్లు ఇంటిముందుకు వచ్చినిలబడుతున్నాయని సమాచారం. 

ఇక ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో 300 కోట్ల క్లబ్ లో చేరిన ఈసినిమా బాలీవుడ్ లో భారీ నెంబర్ తో దూసుకుపోతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. హిందీ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, తాజాగా 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. వరల్డ్ వైడ్ గా హను మాన్ మూవీ 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం లాంగ్ రన్ ను కొనసాగిస్తోంది.

 

ఈ చిత్రం 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం పట్ల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాదు ఈ విషయంపై ఆయన  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ పోస్ట్ కూడా పెట్టారు. టీజర్ లాంచ్ నుండి, గ్రాండ్ రిలీజ్ వరకూ హిందీ ఆడియెన్స్ నుండి మంచి ఆదరణ లభించింది. హను మాన్ ఘన విజయం సాధించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈసినిమాలో  వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇంకెన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios