చిన్న సినిమాగా వచ్చి.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది హనుమాన్ మూవీ. పెద్ద సినిమాలకు పోటీగా సక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన ఈమూవీ.. ఆ సినిమాలకు షాక్ ఇస్తూ.. దూసుకుపోతోంది. 

ప్రతీ సీజన్ లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలకు షాక్ ఇస్తున్నాయి. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. ఈసీజన్ లో కూడా చిన్న సినిమాగా వచ్చి.. సంక్రాంతి సీజన్ కు రారాజుగా మారింది హీనుమాన్ మూవీ. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్స్ ను ఢీకొట్టి నిలబడింది హీనుమాన్ మూవీ. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈమూవీ.. తాజాగా మరో మార్క్ ను క్రాస్ చేసింది. 

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సూపర్ హీరో మూవీ హను మాన్. చిన్న సినిమాగా థియేట్లలోకి వచ్చిన హనుమాన్.. పెద్ద సినిమాలకేచెమటలు పట్టిస్తోంది. సంక్రాంతీ సీజనల్ లో.. అది కూడా మహేష్ బాబు లాంటిపెద్ద హీరోతో పోటీ పడుతూ.. రిలీజ్ అయిన ఈమూవీ.. బాక్సాపీస్ ను షేక్ చేస్తోంది. ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కి వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 

వివాదాల మధ్య రిలీజ్ అయ్యింది హనుమాన్. పెద్ద సినిమాల వల్ల థియేటర్లు దొరకవని, నిర్మాత దిల్ రాజు ఈసినిమాకు థియేటర్లు ఇవ్వలేదంటూ.. వివాదం చెలరేగింది. అందులో నిజం లేదని.. అలాంటి వార్తలు రాయొద్దంటూ.. దిల్ రాజు మీడియాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ రిలీజ్ అయిన ప్రతీ భాషలో అద్భుతమైన రెస్పాన్స్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీవసూళ్లతో దూసుకుపోతుంది. 

ఇక ఈమధ్య 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టిన హనుమాన్ సినిమా.. ఇంకా స్పీడ్ గా కలెక్షన్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా 150 కోట్ల క్లబ్ లో చేరడం జరిగింది. ఇదే విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ.. సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. హను మాన్ మూవీ కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఈ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సెట్ చేస్తోంది. . ఈ చిత్రం లో అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.