ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తమకంటే వయసులో చిన్నవాళ్లను పెళ్లి చేసుకున్నారు. కొందరు నటీమణులు తమకంటే చిన్నవాళ్లతో డేటింగ్ చేస్తున్నారు. కానీ దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ కి మాత్రం అలాంటి ఆలోచన లేదంటోంది. టాలీవుడ్ ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన కాజల్ తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్ 'భారతీయుడు 2' సినిమాతో పాటు బాలీవుడ్ లో 'ముంబై సాగా' అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల తన ట్విట్టర్ లో తన ఫాలోవర్ల సంఖ్య మూడు మిలియన్లకు చేరిన సందర్భంగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. 

ఈ క్రమంలో ఓ అభిమాని కాజల్ కి లవ్ ప్రపోజ్ చేశాడు. తన వయసు  పదిహేడేళ్లని, తెలుగు వాడని అంటూ.. కాజల్ కు తెలుగు రాకపోయినా తను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ ప్రతిపాదించాడు. అది చూసిన కాజల్ వయసులో తన కన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకోనంటూ ఆ ప్రపోజల్ కి నో చెప్పింది.

ఇక పెళ్లెప్పుడు అని ప్రశ్నించిన మరో ఫాలోవర్ కి సమాధానంగా.. తనకు వివాహ బంధంపై ఆసక్తి ఉందని.. అన్నీ కుదిరినప్పుడు పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటానని ప్రకటించింది  కాజల్.