బిగ్ బాస్ సెట్ లో ఒకరు మృతి!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 9, Sep 2018, 11:26 AM IST
technician dies on the sets of bigg boss tamil
Highlights

బిగ్ బాస్ సెట్ లో ఒక వ్యక్తి మృతి చెందారు. ఏసి రిపేర్ చేస్తూ మిద్దె మెట్లపై నుండి జారీ కింద పడి మరణించారు. వివరాల్లోకి వెళితే.. తమిళ బిగ్ బాస్ షూటింగ్ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. 

బిగ్ బాస్ సెట్ లో ఒక వ్యక్తి మృతి చెందారు. ఏసి రిపేర్ చేస్తూ మిద్దె మెట్లపై నుండి జారీ కింద పడి మరణించారు. వివరాల్లోకి వెళితే.. తమిళ బిగ్ బాస్ షూటింగ్ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ సెట్ లో ఏసి మెకానిక్ శుక్రవారం రాత్రి మిద్దె మెట్లపై నుండి జారీ కింద పడిపోయారు. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ షోకి సంబంధించిన షూటింగ్ పూందమల్లి సమీపంలో గల సెంబరంబాక్కంలో జరుగుతోంది. అక్కడ ఏసి మెకానికా గా గుణశేఖరన్(30) అనే వ్యక్తి పని చేస్తున్నాడు.

శుక్రవారం రాత్రి ఏసి రిపేర్ చేస్తోన్న సమయంలో పట్టుతప్పి కింద పడిపోయారు. దీంతో తలకు తీవ్రంగా గాయం కావడంతో అతడిని వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

loader