నందమూరి బాలకృష్ణ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఒంగోలు నుంచి బయలుదేరిన కాసేపటికే తిరిగి వెనక్కి..
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం అనుకూలించకపోవడంతో.. పైలెట్ హెలికాప్టర్‌ను ఒంగోలులోని హెలిప్యాడ్ వద్దే ల్యాండ్ చేశారు. ఇక, బాలకృష్ణ తన తాజా చిత్రం వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం.. చిత్ర యూనిట్‌తో కలిసి హెలికాప్టర్‌లో నిన్న ఒంగోలుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ఒంగోలులోని అర్జున్ ఇన్‌ఫ్రా గ్రౌండ్‌లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గత రాత్రి ఒంగోలులోనే బస చేసిన బాలకృష్ణ.. ఈరోజు ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరారు.
అయితే హెలికాప్టర్ బయల్దేరిన 15 నిమిషాల తర్వాత వాతావరణం అనుకూలించకలేదు. పొగమంచు ఎక్కువగా ఉండటంతో ఎక్కువగా ఉండటంతో పైలెట్ హెలికాప్టర్‌ను తిరిగి ఒంగోలులోని పీటీసీ గ్రౌండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో బాలకృష్ణ ఒంగోలులోనే ఉండిపోయారు. ఏటీసీ నుంచి క్లియరెన్స్ రాగానే బాలకృష్ణ హైదరాబాద్ బయలుదేరనున్నారు.
ఇక, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రానికి బాలయ్యకి జోడీగా శృతి హాసన్ నటించింది. జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ అభిమానుల్ని అలరిస్తున్నాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో విలన్ గా దునియా విజయ్ కనిపించనున్నాడు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనున్నాయని అంటున్నారు. నందమూరి అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.