క్రికెట్ ప్రపంచకప్ ఇంగ్లాడ్ వేదికగా రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా ఇప్పటికే రెండు విజయాలు సొంతం చేసుకుని ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియాకు కాస్త విరామం దొరికింది. ఈ విరామంలో ఆటగాళ్లు సరదాగా గడుపుతున్నారు. తాజాగా టీమిండియా ఆటగాళ్లు ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ తదితరులు ఇంగ్లాండ్ లోని నాట్టింగ్ హామ్ లో సల్మాన్ ఖాన్ 'భారత్' చిత్రాన్ని వీక్షించారు. 

ఈ విషయాన్ని ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 'భారత్ మూవీ చూసిన తర్వాత భారత జట్టుతో' అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించాడు. 'థాంక్యూ భారత్ టీం.. భారత్ చిత్రాన్ని చూసినందుకు'.. మీరు ఆడబోయే తదుపరి మ్యాచ్ లకు ఆల్ ది బెస్ట్. దేశం మొత్తం మీ వెనుక ఉంది అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశాడు. 

అలీ అబ్బాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారత్ చిత్రం జూన్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కు జోడిగా కత్రినా కైఫ్ నటించింది. దిశా పటాని కీలక పాత్రలో నటించింది. పాజిటివ్ టాక్ తో భారత్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.