హీరో నాగ చైతన్య నెక్స్ట్ మూవీ గురించి టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతున్న క్రమంలో టీమ్ క్లారిటీ ఇచ్చారు. వార్తలను ఖండించారు.
అక్కినేని హీరో నాగ చైతన్య టైం బాగోలేదు. ఆయనకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. గత ఏడాది థాంక్యూ అంటూ ప్రేక్షకులను పలకరించారు. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన థాంక్యూ అత్యంత చెత్త మూవీగా పేరు తెచ్చుకుంది. కథ, కథనాలు లేకుండా నచ్చినట్లు ఓ మూవీ తీసి జనాల మీదకు వదిలారు. థాంక్యూ విక్రమ్ కే కుమార్ ఇమేజ్ భారీగా దెబ్బతీసింది.
లేటెస్ట్ రిలీజ్ కస్టడీ మరో డిజాస్టర్ అయ్యింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు నిరాశపరిచాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఒక విధంగా చెప్పాలంటే నాగ చైతన్య కెరీర్ డైలమాలో పడింది. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ ఎలాంటి చిత్రం చేస్తారనే సందిగ్ధత కొనసాగుతుంది. కాగా 2022 బాలీవుడ్ హిట్ మూవీ భూల్ బులయా 2 రీమేక్ లో నాగ చైతన్య నటిస్తున్నారనే ఓ ప్రచారం జరుగుతుంది.
హిందీలో కార్తీక్ ఆర్యన్ ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్ర రీమేక్ పై కన్నేసిన నాగ చైతన్య కన్ఫర్మ్ చేశారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను టీమ్ ఖండించింది. భూల్ బులయా 2 రీమేక్ నాగ చైతన్య చేస్తున్నారన్న మాటల్లో వాస్తవం లేదని తేల్చిపారేశారు. నాగ చైతన్య ఎలాంటి రీమేక్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. దాంతో పుకార్లకు చెక్ పడింది.
నాగ చైతన్య దూత టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశారు. ఇది ప్రైమ్ లో విడుదల కావాల్సి ఉంది. దూత సిరీస్ పై చాలా కాలంగా అప్డేట్ లేదు. ఇక అక్కినేని హీరోలు నాగార్జున, అఖిల్, నాగ చైతన్య పరాజయాలతో సతమతం అవుతున్నారు. అఖిల్ ఏజెంట్ భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది.
