అంతా తూచ్.. భారీ రేట్‌కి ఓటీటీలో `వరుణ్‌లవ్` పెళ్లి వీడియో.. టీమ్ క్లారిటీ
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవల పెళ్లి చేసుకున్న నేపథ్యంలో వారి మ్యారేజ్ వీడియో హక్కులను ప్రముఖ ఓటీటీ తీసుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై టీమ్ క్లారిటీ ఇచ్చింది.

వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లి వేడుక జరిగి వారం రోజులు అవుతుంది. ఇటలీలో చాలా గ్రాండ్‌గా, లావిష్ మ్యానర్‌లో వీరి వెడ్డింగ్ జరిగింది. రాయల్ కల్చర్‌కి కేరాఫ్‌గా నిలిచిందని చెప్పొచ్చు. వరుణ్, లావణ్యలు లవ్ ప్రపోజ్ చేసుకున్న ఇటలీలోనే వారు తమ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారు. అలా తమ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకున్నారు. ఈ ఆదివారం హైదరాబాద్‌లో రిసెప్షన్ కూడా నిర్వహించారు. అయితే ఈ రిసెప్షన్‌కి పెద్ద హీరోలెవరూ కనిపించలేదు. చిరంజీవి, వెంకటేష్ తప్ప మిగిలిన వాళ్లెవరూ రాలేదు. మెగా ఫ్యామిలీ కూడా హాజరు కాలేదు.
రామ్‌చరణ్, బన్నీ, పవన్ వంటి వారు మిస్ అయ్యారు. అంటే ఇది పూర్తిగా ఇండస్ట్రీకి అని వదిలేసినట్టు తెలుస్తుంది. అయితే స్టార్ డైరెక్టర్లు కూడా రాలేదు. దీంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. వారికి ఆహ్వానం అందలేదా? లేక కుదరక రాలేకపోయారా? అనేది పెద్ద సస్పెన్స్. ఏదేమైనా అది ఒక చర్చనీయాంశమైంది. అయితే తాజాగా వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లికి సంబంధించిన ఓ విషయంలో హాట్ టాపిక్ అవుతుంది. వీరిద్దరి పెళ్లి వీడియో ఓ ప్రముఖ ఓటీటీ కొనుగోలు చేసిందని భారీ ధరకి తీసుకుందని ప్రచారం జరుగుతుంది. నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.8కోట్లకు ఈ హక్కులు తీసుకుందని అంటున్నారు.
ఇది గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రధాన మీడియా మాధ్యమాల్లోనూ వచ్చింది. దీంతో తాజాగా వరుణ్‌తేజ్, లావణ్య టీమ్ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రముఖ ఓటీటీలో తమ పెళ్లి వీడియో ప్రసారం అవుతుందనే వార్తలో నిజం లేదని, ఏ ఓటీటీకి తాను ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు. ఇలాంటి బేస్‌లెస్ రూమర్లని నమ్మకండి అని వెల్లడించింది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. `మిస్టర్` సినిమా సమయంలో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కానీ ఇద్దరి ప్రేమకి కారణమైంది. ఈ చిత్రంతోనే ఈ ఇద్దరు ఒకరికొకరు దగ్గరయ్యారు. లవ్ స్టోరీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత `అంతరిక్షం`లోనూ కలిసి నటించారు. ప్రేమని బలంగా మార్చుకున్నారు. ఆ తర్వాత డీప్ లవ్ లో ఉన్న ఈ జంట గతేడాది దొరికిపోయింది. ఆతర్వాత తమ ప్రేమని ప్రకటించారు. జూన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.