అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకోగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. స్మాల్ బిజినెస్ జెట్ ఉదయం 11:00 గంటల సమయంలో యూఎస్ సిటీ నాష్విల్లే సమీపంలో గల ఓ సరస్సు వద్ద  కూలిపోయింది. ఈ ప్లేన్ లో టార్జాన్ ఫేమ్ జో లారా కూడా ప్రయాణిస్తున్నారని సమాచారం. ఆయన కూడా ఈ ప్రమాదంలో మరణించే అవకాశం కలదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


ది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూలిపోయిన ఆ విమానంలో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారని నిర్ధారించింది. ప్లేన్ కూలిన ప్రాంతానికి చేరుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అర కిలోమీటర్ పరిధిలో విమాన భాగాలు, బాధితుల శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని అధికారులు వివరిస్తున్నారు. 


ఆదివారం చీకటి పడిన వరకు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించిన అధికారులు సోమవారం తిరిగి ప్రారంభించనున్నారు. జో లారా గురించి ఎటువంటి ఆచూకీ లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. 1989లో ప్రసారమైన టెలివిజన్ మూవీ ''టార్జాన్ ఇన్ మాన్హట్టన్" లో జో లారానటించారు. ఆ తరువాత టార్జాన్ అనే టీవీ సిరీస్ లో నటించడం జరిగింది. జో లారా భార్య పేరు గ్వేన్ శామ్బ్లిన్, వీరు 2018లో వివాహం చేసుకున్నారు.