తను హీరోగా పరిచయమైన సూపర్‌హిట్‌ సినిమా ‘నువ్వే కావాలి’ విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తరుణ్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్బంగా ఫొటోలు రిలీజ్ చేసారు. ఆ ఫొటోలు చూసిన వాళ్లు ఒకప్పటి లవర్ బోయ్ తరుణ్ ని గుర్తు చేసుకుంటున్నారు. ఎంతగా మారిపోయాడు అంటున్నారు. మీరు ఇక్కడ ఫొటో లలో ఆ తేడా చూడవచ్చు.

 ‘నువ్వే కావాలి’లో నటించిన తరుణ్, ఇతను ఒకరే అంటే నమ్మబుద్ధి కావడం లేదు. అప్పట్లో ఆ ఒక్క సినిమాతో తరుణ్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. అందం, అభినయం రెండూ ఉన్న తరుణ్‌‌కు వరుస బెట్టి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ‘ప్రియమైన నీకు’, ‘నువ్వే నువ్వే’ లాంటి హిట్లు అతణ్ని ఇంకా పెద్ద రేంజికి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఈ ఫొటోల్లో బాగా జుట్టు పెంచుకుని, మీసం తీసేసి కొత్త లుక్‌లోకి మారాడు తరుణ్. కెరీర్ విషయానికి వస్తే... చివరగా రెండేళ్ల కిందట తరుణ్ నుంచి వచ్చిన ‘ఇది నా లవ్ స్టోరీ’ వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. 
 
 ఇక త‌రుణ్‌, రిచా, సాయి కిర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కె. విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం నువ్వే కావాలి. ప్రేమ క‌థా చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రం   20 ఏళ్ళు పూర్తి చేసుకుంది  ఉషా కిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన నువ్వే కావాలి చిత్రం మ‌ల‌యాళీ సినిమా నిర‌మ్ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రాన్ని రీమేక్ రైట్స్  తీసుకొని విజ‌య్ భాస్క‌ర్, త్రివిక్ర‌మ్ స్క్రిప్ట్ రాశారు. ఈ చిత్రాన్ని హిందీలో తుఝే మేరీ క‌స‌మ్ అనే పేరుతో పున‌ర్మించారు.  కోటి అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

ఈ సినిమా ..సునీల్‌, ఎంఎస్ నారాయ‌ణ కామెడీతో పాటు గిరిబాబు, చ‌ల‌ప‌తి రావు న‌టన‌ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించింది. ఈ చిత్రం విడుద‌లై 20 ఏళ్ళు అయిన‌ప్ప‌టికీ ఇప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్‌నే తీసుకొస్తుంది.