ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పవన్ 'జనసేన పార్టీ' కూడా పాల్గొనబోతుంది. దీంతో రాజకీయాల వేడి మరింతగా పెరిగింది.

రాజకీయాల పరంగా పవన్ ని బద్నామ్ చేయడానికి ఓ వర్గం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పవన్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ అతడిపై విమర్శలు చేస్తోన్న ఈ వర్గం ఈసారి మరోప్లాన్ చేస్తోందట. దీనికోసం పూనమ్ కౌర్ ని సంప్రదించినట్లుతెలుస్తోంది. పవన్ తో పూనమ్ కి ఉన్న బంధం గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఈ విషయంపై గతంలో కత్తి మహేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మరోసారి ఈ విషయాన్ని పెద్దది చేయాలని అనుకుంటున్నారట. ఆ విధంగా పవన్ స్థాయిని తగ్గుతుందని భావిస్తున్నారు. దీనికోసం పూనమ్ కి పదిహేను కోట్లు ఆఫర్ కూడా చేశారట. పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం కోసం పూనమ్ కి ఇంత పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం.

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, ఓ భారీ సీరియల్ లో నటిస్తోన్న పూనమ్ ఈ వివాదానికి దూరంగా ఉండాలని అనుకుంటోంది. అందుకే ఇంత పెద్ద డీల్ ఆఫర్ చేసినా కాదంటోందట. ఈ వివాదానికి పూర్తిగా దూరంగా ఉండాలని భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి!